News October 31, 2025
వెంకటగిరి: బాలికపై లైంగిక దాడి.. మారుతండ్రికి జీవిత ఖైదు

బాలికపై మారు తండ్రి పలుమార్లు లైంగిక దాడి చేసిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడు సర్వేపల్లి అంజయ్యకు జీవిత ఖైదుతో పాటు రూ.40 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. వెంకటగిరి బంగారు పేట అరుంధతి పాలేనికి చెందిన సర్వేపల్లి అంజయ్యకు ఓ వివాహితతో పరిచయం ఏర్పండి. ఈ క్రమంలో ఆమెతో ఉంటూ మహిళ 15 ఏళ్ల కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 2021 జులై 19న కేసు నమోదైంది.
Similar News
News October 31, 2025
సూర్యాపేట: ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య

సంగారెడ్డి జేఎన్టీయూ హాస్టల్‌లో మోతె మండలం, సిరికొండ తాండాకు చెందిన విద్యార్థి మహేందర్ ఆత్మహత్య చేసుకున్నాడు. 3 రోజులుగా కాలేజీకి వెళ్లకుండా హాస్టల్ గదిలో ఉన్న మహేష్ శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తోటి విద్యార్థులు తెలిపారు. మహేష్ గదిలో సూసైడ్ నోటు లభ్యమైనట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 31, 2025
MNCL: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్‌లకు సత్కారం

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను సీపీ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం సత్కరించారు. కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన పోలీస్‌లు ఏఎస్ఐ రామస్వామి, హెడ్ కానిస్టేబుల్ తిరుపతిని పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవితం గడపాలని సూచించారు.
News October 31, 2025
ఇంట్లో గోడ కూలి మహిళ మృతి.. మరొకరికి గాయాలు

ఇంట్లోని గోడ కూలి మహిళ మృతి చెందగా, మరో మహిళకు గాయాలైన ఘటన శుక్రవారం చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి గ్రామం హరింద్రానగర్‌లో చోటుచేసుకుంది. కొట్లూరు శివమ్మ (52)ను గాయాలతో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో మహిళ అత్త కొట్లూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై చింతకొమ్మదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


