News October 31, 2025
TG SET దరఖాస్తు గడువు పొడిగింపు

తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్‌షిప్ అర్హత కోసం నిర్వహించే TG SET-2025 దరఖాస్తు గడువును పొడిగించారు. పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులో తప్పుల సవరణకు నవంబర్ 26 నుంచి 28 వరకు అవకాశం ఇస్తారు. డిసెంబర్ 3న హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ రెండో వారంలో పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: http://telanganaset.org/
Similar News
News October 31, 2025
ఘనంగా అల్లు శిరీష్ ఎంగేజ్‌మెంట్

హీరో అల్లు శిరీష్-నయనిక ఎంగేజ్‌మెంట్ ఇవాళ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితుల సమక్షంలో వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితరులు హాజరయ్యారు. పెళ్లి తేదీపై త్వరలో ప్రకటన రానుంది.
News October 31, 2025
ఆ హక్కు బీఆర్ఎస్‌కు లేదు: రేవంత్

TG: బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ‘సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది బీఆర్ఎస్సే. గతంలో పీజేఆర్ చనిపోతే దుర్మార్గంగా తమ అభ్యర్థిని నిలబెట్టింది. ఇప్పుడు ఆ పార్టీకి సానుభూతి ఓట్లు అడిగే హక్కు లేదు’ అని మండిపడ్డారు. ఓట్లు అడిగేందుకు బీఆర్ఎస్ నేతలు వస్తే వాతలు పెట్టాలని అన్నారు.
News October 31, 2025
బ్యాంకులకు కొత్త డొమైన్.. నేటితో ముగిసిన గడువు

సైబర్ నేరాలను తగ్గించడమే లక్ష్యంగా బ్యాంకులు తమ వెబ్‌సైట్లను .bank.in డొమైన్‌కు మార్చుతున్నాయి. ఇందుకు RBI విధించిన గడువు నేటితో ముగిసింది. ఇప్పటి వరకు SBI, PNB, CANARA వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు HDFC, ICICI, AXIS, కోటక్ మహీంద్రా వంటి ప్రైవేటు బ్యాంకులూ కొత్త డొమైన్‌కు మారాయి. మరికొన్ని బ్యాంకులు .comతో కొనసాగుతూ ఏదైనా కేటగిరీ ఎంచుకున్నప్పుడు .bank.inకు రీడైరెక్ట్ చేస్తున్నాయి.


