News October 31, 2025
ADB: బల్ల కింద మాకిస్తేనే.. మీ పని చేస్తాం

ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ అధికారులు లంచాల మత్తులో మునిగి అవినీతికి పాల్పడుతున్నారు. సంక్షేమ పథకాల బిల్లులను మంజూరు చేయడానికి సామాన్యులను పీడిస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో రెండు శాఖల అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. పశువుల షెడ్డుకు రూ.10వేలు, సస్పెన్షన్ ఎత్తివేతకు రూ.2 లక్షలు లంచం అడగడం అధికారుల దురాశకు నిదర్శనం. లంచం అడిగితే 1064, 9440446106 నంబర్లకు కాల్ చేయండి.
Similar News
News October 31, 2025
జనగామ: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి!

ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యబోధన అందించాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నారు. విడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జనగామ నుంచి కలెక్టర్ రిజ్వాన్ భాషా పాల్గొన్నారు.
News October 31, 2025
ఘోరం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

చాక్లెట్ ఆశ చూపి నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు ఈ ఘోరానికి పాల్పడ్డారు. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు ఆమెను కాపాడి, నిందితులను పోలీసులకు అప్పగించారు. బాలికను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
News October 31, 2025
సంగారెడ్డి: రేపు టీ- షాట్ నిపుణలో ప్రత్యక్ష ప్రసారం

వాల్యూ ఎడ్యుకేషన్ పై నవంబర్ 1న టీ షాట్ నిపుణలో మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు వ్యాల్యూ ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పిస్తారని చెప్పారు. అన్ని పాఠశాలలో విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని చూపించాలని సూచించారు.


