News October 31, 2025

గణపవరం తిరిగి ఏలూరు జిల్లాలోకి?

image

ఒక నియోజకవర్గం ఒకే డివిజన్‌లో ఉంచాలన్న ప్రభుత్వం నిర్ణయం ఇప్పడు గణపవరం మండల ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ నిర్ణయం అమలైతే ఆ మండలం ఏలూరు జిల్లాలో కలిసే అవకాశముంది. గత ప్రభుత్వంలో తమకు భీమవరం దగ్గరని.. ఏలూరులో కలపొద్దని అక్కడి ప్రజలు కోరారు. దీంతో ఉంగుటూరు నియోజకవర్గం ఏలూరులో కలిసినా గణపవరంను భీమవరం రెవెన్యూ డివిజన్లో ఉంచేశారు. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారు మళ్లీ ఆందోళనలు చేపడుతున్నారు.

Similar News

News October 31, 2025

జనగామ: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి!

image

ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యబోధన అందించాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నారు. విడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జనగామ నుంచి కలెక్టర్ రిజ్వాన్ భాషా పాల్గొన్నారు.

News October 31, 2025

ఘోరం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

image

చాక్లెట్ ఆశ చూపి నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు ఈ ఘోరానికి పాల్పడ్డారు. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు ఆమెను కాపాడి, నిందితులను పోలీసులకు అప్పగించారు. బాలికను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.

News October 31, 2025

సంగారెడ్డి: రేపు టీ- షాట్ నిపుణలో ప్రత్యక్ష ప్రసారం

image

వాల్యూ ఎడ్యుకేషన్ పై నవంబర్ 1న టీ షాట్ నిపుణలో మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు వ్యాల్యూ ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పిస్తారని చెప్పారు. అన్ని పాఠశాలలో విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని చూపించాలని సూచించారు.