News October 31, 2025

UPDATE: నవ దంపతులను తీసుకొస్తుండగా యాక్సిడెంట్

image

హనుమకొండ జిల్లాలో రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో <<18155214>>ముగ్గురు మృతి<<>>చెందిన విషయం తెలిసిందే. బంధువులు తెలిపిన వివరాలిలా.. కురవి మండలం సూధనపల్లికి చెందిన యువతికి బుధవారం పెళ్లైంది. నవదంపతులను తీసుకొస్తుండగా గోపాలపురం వద్ద రోడ్డు పక్కకు ఆపిన వీరి బోలేరోను వేగంగా వచ్చిన బోర్ వెల్స్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనాథ్, స్వప్న, కలమ్మ స్పాట్‌లోనే మృతి చెందగా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Similar News

News October 31, 2025

జనగామ: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి!

image

ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యబోధన అందించాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నారు. విడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జనగామ నుంచి కలెక్టర్ రిజ్వాన్ భాషా పాల్గొన్నారు.

News October 31, 2025

ఘోరం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

image

చాక్లెట్ ఆశ చూపి నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు ఈ ఘోరానికి పాల్పడ్డారు. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు ఆమెను కాపాడి, నిందితులను పోలీసులకు అప్పగించారు. బాలికను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.

News October 31, 2025

సంగారెడ్డి: రేపు టీ- షాట్ నిపుణలో ప్రత్యక్ష ప్రసారం

image

వాల్యూ ఎడ్యుకేషన్ పై నవంబర్ 1న టీ షాట్ నిపుణలో మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు వ్యాల్యూ ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పిస్తారని చెప్పారు. అన్ని పాఠశాలలో విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని చూపించాలని సూచించారు.