News October 31, 2025
సీపీఎం నేత దారుణ హత్య

TG: ఖమ్మం జిల్లా CPM రైతు సంఘం నేత సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఉదయం చింతకాని(M) పాతర్లపాడులో వాకింగ్‌కు వెళ్లిన సమయంలో దుండగులు గొంతుకోసి హత్య చేశారు. ఈయన ఉమ్మడి APలో సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పని చేశారు. రామారావు హత్య పట్ల Dy.CM భట్టి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులను పట్టుకొని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. రాష్ట్రంలో హింసా రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు.
Similar News
News November 1, 2025
అమెరికాలో ఉగ్రదాడులకు కుట్ర.. భగ్నం చేసిన ఎఫ్‌బీఐ

అమెరికాలో ఉగ్ర దాడుల కుట్రను భగ్నం చేసినట్లు FBI డైరెక్టర్ కాశ్ పటేల్ తెలిపారు. మిషిగన్‌లో హాలోవీన్ వీకెండ్‌లో హింసాత్మక దాడులకు ప్లాన్ చేసిన పలువురిని అరెస్టు చేసినట్లు ట్వీట్ చేశారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. FBI ఏజెంట్లు, అధికారులు దేశాన్ని రక్షిస్తున్నారని అభినందించారు. అంతకుముందు మిషిగన్‌లో FBI సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించినట్లు డియర్‌బర్న్ పోలీసులు వెల్లడించారు.
News October 31, 2025
షెఫర్డ్ హ్యాట్రిక్.. బంగ్లాతో సిరీస్ క్లీన్‌స్వీప్

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో T20లో విండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ హ్యాట్రిక్ వికెట్లు తీశారు. వరుస బంతుల్లో నురుల్, తంజీద్, షొరిఫుల్‌లను ఔట్ చేశారు. తద్వారా ఈ ఫార్మాట్‌లో హ్యాట్రిక్ తీసిన రెండో WI ఆటగాడిగా నిలిచారు. గతంలో హోల్డర్ ENGపై 3 బంతుల్లో 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో బంగ్లా 151 పరుగులకే ఆలౌటవగా 16.5 ఓవర్లలో విండీస్ లక్ష్యాన్ని చేధించింది. దీంతో 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
News October 31, 2025
ఇక మిగిలింది రాజగోపాల్ రెడ్డేనా..!

TG: సుదీర్ఘ కాలానికి CONG అధికారంలోకి రావటంతో పదవులు ఆశిస్తున్న వారు అధికంగానే ఉన్నారు. హైకమాండ్, CM రేవంత్ ఏదో రకంగా వారికి న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వ్యూహాత్మకంగా పోస్టుల భర్తీ చేపట్టారు. అజహరుద్దీన్‌ను మంత్రిగా, మంత్రి పదవులు కోరిన సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులను అడ్వైజర్, ఛైర్మన్‌గా నియమించారు. ఇక మిగిలింది రాజగోపాల్ రెడ్డే. ఆయనను ఎలా సంతృప్తిపరుస్తారనేది ఆసక్తికరం.


