News October 31, 2025
గరుడవారధిపై ప్రమాదాలు .. నియంత్రణ ఇలా..!

గరుడ వారధిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అది ప్రమాదాల వారధిగా మారటానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. విశాలమైన రోడ్లలో ఎంత స్పీడ్ వెల్తే అంత మజా అంటూ యువత ప్రాణాలపైకి తెచ్చుకుంటోంది. మలుపు వద్ద వేగ నియంత్రణ కాకపోవడమే ప్రమాదానికి ఒక కారణంగా చెప్పవచ్చు. వేగాన్ని నియంత్రించడంలో మలుపుల వద్ద స్పీడ్ బంప్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయని పలువురు చెబుతున్నారు.
Similar News
News November 1, 2025
పెద్దపల్లి: ప్రమాదాలకు నిలువుగా రాజీవ్ రహదారి

PDPL పట్టణంలోని రాజీవ్ రహదారికి సర్వీస్ రోడ్లు లేక ప్రమాదాలకు నిలువుగా మారింది. గురువారం ఉదయం బంధంపల్లి శాంతినగర్‌కు చెందిన పెంజర్ల లక్ష్మీనారాయణ (35) పాలు అమ్మడానికి వెళ్తుండగా బస్టాండ్ సిగ్నల్ వద్ద గోదావరిఖని వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతనిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 1, 2025
6.30 నుంచే పెన్షన్ల పంపిణీ: తిరుపతి కలెక్టర్

తిరుపతి జిల్లాలో శనివారం ఉదయం 6.30కే పెన్షన్లు పంపిణీ ప్రారంభించాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఎట్టి పరిస్థితిలోనూ ఉదయం 7గంటలకు 100 శాతం సిబ్బంది పింఛన్ల పంపిణీ ప్రారంభించాలన్నారు. పునః పరిశీలనలో అనర్హులుగా గుర్తించిన పింఛనుదారులు, అప్పీలు చేసుకోని వారికి కూడా ఈనెల పింఛన్‌ను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వారికీ సచివాలయ సిబ్బంది నగదు పంపిణీ చేయాలన్నారు.
News November 1, 2025
మెదక్ జిల్లా ఇందిరాగాంధీని మర్చిపోదు: మంత్రి

ఉమ్మడి మెదక్ జిల్లా ఇందిరాగాంధీని ఎప్పటికీ మర్చిపోదని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మునిపల్లి మండలం పెద్ద చల్మెడ గ్రామంలో ఆమె చిత్రపటానికి శుక్రవారం సాయంత్రం పూలమాలవేసి నివాళి అర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. జిల్లాకు కేంద్ర పరిశ్రమలు తీసుకువచ్చిన ఘనత ఇందిరా గాంధీకి దక్కుతుందని చెప్పారు.


