News October 31, 2025

శ్రీను హత్యకు ఆ ఆడియోనే కారణమా!

image

అమలాపురం(M) కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీను హత్యకు ఫోన్ కాల్ ఆడియోనే కారణమా అన్న దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గంగుమళ్ళ కాసుబాబుతో శ్రీను మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మృతుడు శ్రీను, కాసుబాబు మధ్య జరిగిన వ్యక్తిగత దూషణలు, ఆ ఆడియో వేరే వాళ్లకు పంపడం హత్యకు దారితీశాయని అనుమానిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల ఇందుకు మూలంగా భావిస్తున్నారు.

Similar News

News November 1, 2025

ఆమెకు మతం మారే ఆలోచన లేదు: జేడీ వాన్స్

image

హిందువైన తన భార్య ఉష <<18155411>>క్రైస్తవంలోకి మారే <<>>ఛాన్స్ ఉందంటూ అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. దీంతో ఆయన క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు. తన భార్య క్రిస్టియన్ కాదని, మతం మారే ఆలోచన కూడా ఆమెకు లేదని చెప్పారు. అయితే ఏదో ఒకరోజు తాను చూసినట్లే తన భార్య చూస్తుందని భావిస్తున్నానని తెలిపారు. సువార్త నిజమని, అందరికీ మంచిదని క్రైస్తవం చెబుతుందని అన్నారు.

News November 1, 2025

పెండింగ్ రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలలో పెండింగ్‌లో ఉన్న వివిధ రెవెన్యూ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రెవెన్యూ అంశాలపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న భూ రికార్డులు, భూ భారతి, భూ వివాదాల దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

News November 1, 2025

పెద్దపల్లి: ప్రమాదాలకు నిలువుగా రాజీవ్ రహదారి

image

PDPL పట్టణంలోని రాజీవ్ రహదారికి సర్వీస్ రోడ్లు లేక ప్రమాదాలకు నిలువుగా మారింది. గురువారం ఉదయం బంధంపల్లి శాంతినగర్‌కు చెందిన పెంజర్ల లక్ష్మీనారాయణ (35) పాలు అమ్మడానికి వెళ్తుండగా బస్టాండ్ సిగ్నల్ వద్ద గోదావరిఖని వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతనిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.