News October 31, 2025

NTR: 586 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం

image

తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 586.5 ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలు దెబ్బతిన్నాయని జిల్లా ఉద్యాన అధికారి పి. బాలాజీ కుమార్ తెలిపారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి, నందిగామ, చందర్లపాడు, వీరులపాడు, గంపలగూడెం, ఇబ్రహీంపట్నం, జి కొండూరు, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లో 399 మంది రైతులకు దాదాపు రూ. 5.50కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు.

Similar News

News November 1, 2025

కరీంనగర్ సీపీఓగా పూర్ణచంద్రారావు అదనపు బాధ్యతలు

image

కరీంనగర్ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (Chief Planning Officer – CPO)గా పనిచేసిన ఆర్. రాజారాం ఉద్యోగ విరమణ చేయడంతో, ఆ స్థానంలో మంచిర్యాల సీపీఓగా ఉన్న వి. పూర్ణచంద్రారావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆర్థిక, గణాంకాల శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వి. పూర్ణచంద్రారావు శుక్రవారం కరీంనగర్ సీపీఓగా బాధ్యతలు స్వీకరించారు.

News November 1, 2025

నూతన ట్రాఫిక్ స్టేషన్ కార్యాలయాలను ప్రారంభించిన సీపీ

image

KNR ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనంలో నూతనంగా తీర్చిదిద్దిన ACP, CI, సిటీ రైటర్ కార్యాలయాలను CP గౌస్ అలాం శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ DCP వెంకటరమణ, ACPలు శ్రీనివాస్, వెంకటస్వామి, విజయకుమార్, యాదగిరి స్వామి, వేణుగోపాల్, శ్రీనివాస్ జి, CIలు కరిముల్లా ఖాన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్ నిర్వహణను మరింత మెరుగుపరచడానికి ఈ నూతన కార్యాలయాలు దోహదపడతాయని CP పేర్కొన్నారు.

News November 1, 2025

కామారెడ్డి: విద్యాశాఖ పనుల ప్రగతిపై రాష్ట్ర కార్యదర్శి సమీక్ష

image

రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా శుక్రవారం నిర్వహించిన వీసీలో KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో శుభ్రత, అసురక్షిత నిర్మాణాల కూల్చివేత, పెయింటింగ్ పురోగతిపై చర్చించారు. అలాగే UDISE డేటా, ఇంటర్నెట్ కనెక్టివిటీ, SSC, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతాలు వంటి కీలక అంశాలపై కార్యదర్శి సమీక్షించారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.