News April 10, 2024
కవిత పిటిషన్‌పై కాసేపట్లో విచారణ

లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తనను విచారించడంపై MLC కవిత వేసిన పిటిషన్ కాసేపట్లో విచారణకు రానుంది. మధ్యాహ్నం 12 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఆమె పిటిషన్‌పై వాదనలు విననుంది. ప్రస్తుతం తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కవితను విచారించేందుకు సీబీఐ గతవారం అనుమతి తీసుకుంది. దీన్ని సవాలు చేస్తూ ఆమె కోర్టును ఆశ్రయించారు.
Similar News
News January 13, 2026
రూ.లక్షకుపైగా జీతంతో ఉద్యోగాలు

షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 260 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నేవీ నోటిఫికేషన్ ఇచ్చింది. పోస్టును బట్టి BE/BTech, MBA, BSc/B.Com/BSc(IT), MSc/MA, ME/MTech ఉత్తీర్ణత, ఫిజికల్ ఎఫిషియన్సీ ఉండాలి. మెరిట్, SSB ఇంటర్వ్యూ, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.1.25 లక్షల జీతం ఉంటుంది. అర్హతగల వారు JAN 24-FEB 24 వరకు అప్లై చేసుకోవచ్చు. అధికారిక <
News January 13, 2026
ఇరాన్ టారిఫ్ బాంబ్.. భారత్‌పై ప్రభావమెంత?

ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై <<18842223>>25% టారిఫ్<<>> విధిస్తామని అమెరికా ప్రకటించింది. ఇది భారత్‌కూ వర్తిస్తుంది. ఇప్పటికే రష్యాతో చమురు కొనుగోలు వల్ల US మనపై 50% సుంకాలు బాదుతోంది. తాజాగా ఇరాన్ ఎఫెక్ట్ కూడా పడితే మొత్తంగా అగ్రరాజ్యానికి మనం చేసే ఎగుమతులపై 75% టారిఫ్‌లు కట్టాల్సి వస్తుంది. టెహ్రాన్‌లోని ఎంబసీ లెక్కల ప్రకారం.. భారత్-ఇరాన్ మధ్య $1.68B (దాదాపు రూ.15,150 కోట్లు) బైలేటరల్ ట్రేడ్ కొనసాగుతోంది.
News January 13, 2026
రొయ్యల చెరువులో ఈ మార్పులు కనిపిస్తే..

కొన్నిసార్లు రొయ్యల చెరువులో నీటి నాణ్యత చాలా వేగంగా పడిపోతుంది. రొయ్యలు చెరువు అడుగు భాగంలోనే ఎక్కువ కాలం పాటు ఉంటాయి. ఒకవేళ చెరువు అడుగు భాగం చెడితే రొయ్యల ఆరోగ్యం దెబ్బతింటుంది. చెరువు అడుగు భాగం పాడైనట్లు కొన్ని సంకేతాలతో గుర్తించవచ్చు. కుళ్లిన గుడ్డు వాసన రావడం, రొయ్యలు చెరువు అంచులకు లేదా ఎయిరేటర్ల దగ్గరకు ఎక్కువగా చేరటం, అధిక బురద, రొయ్యలు బలహీనంగా మారటం వంటి లక్షణాలతో గుర్తించవచ్చు.


