News October 31, 2025

మాగంటి సునీతపై బోరబండ PSలో కేసు నమోదు

image

బీఆర్ఎస్ గుర్తు ఉండే ఓటర్ స్లిప్‌లను ఆ పార్టీ శ్రేణులు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నేత సామ రామ్‌మోహన్‌రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయి రామ్‌కు ఫిర్యాదు చేశారు. సునీతపై ఇచ్చిన ఆధారాలను గుర్తించిన రిటర్నింగ్ అధికారి బోరబండ PSలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News November 1, 2025

IBM సహకారంతో నేషనల్ ‘AI LAB’

image

విద్యార్థులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో తీర్చిదిద్దడంలో మరో ముందడుగు పడింది. ‘నేషనల్ AI ల్యాబ్’ ఏర్పాటుకు మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ IBM, AICTE వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నాయి. ఢిల్లీలో ఏర్పాటుకానున్న ల్యాబ్ పరిశోధన, నైపుణ్యం, నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా నిలువనుంది. 1000కి పైగా కోర్సుల ద్వారా 30M మందికి AI పరిజ్ఞానం అందనుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు తదుపరి తరాన్ని అందించడంలో ఇది దోహదపడనుంది.

News November 1, 2025

భీమారం: రైతులు ఆందోళన చెందొద్దు: కలెక్టర్

image

భీమారం మండలం కేంద్రంలో తుఫాన్ కారణంగా కురిసిన అకాల వర్షాలకు నేలకొరిగిన వరి పంటలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. అనంతరం మండలంలోని దేశాయిపేటలో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. మొలకలు వచ్చిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు.

News November 1, 2025

అది చెడు పాలన ఫలితం: అజిత్ దోవల్

image

చెడు పాలన పరిణామాలతో బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌లో ప్రభుత్వాలు మారాయని NSA అజిత్ దోవల్ అన్నారు. ఆర్థిక వైఫల్యాలు, ఆహార కొరత, ద్రవ్యోల్బణం, సామాజిక సంఘర్షణలే వాటి పతనానికి కారణమని పేర్కొన్నారు. దేశాలను నిర్మించడంలో బలమైన పాలన ఎంతో ముఖ్యమని రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో చెప్పారు. దేశంలో టెర్రరిజాన్ని సమర్థంగా ఎదుర్కొన్నామని, J&K తప్ప ఎక్కడా 2013 నుంచి టెర్రర్ అటాక్ జరగలేదని తెలిపారు.