News April 10, 2024
వల్లభనేని వంశీ ముంగిట అరుదైన రికార్డు

గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి 2014, 19 ఎన్నికల్లో గెలిచిన వంశీ వల్లభనేని తాజాగా వైసీపీ తరఫున బరిలోకి దిగనున్నారు. గన్నవరంలో 1955 నుంచి వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ విజయాలు ఎవరూ సాధించలేదు. 2024 ఎన్నికలలో వంశీ గెలిస్తే గన్నవరం గడ్డపై హ్యాట్రిక్ కొట్టిన మొదటి నాయకుడవుతారు. టీడీపీ నుంచి ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావు బరిలో ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారని అనుకుంటారో కామెంట్ చేయండి.
Similar News
News April 11, 2025
MTM: పోలీసు అధికారులు, సిబ్బందికి రివార్డులు

మచిలీపట్నంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మార్చి నెల జరిగిన క్రైమ్ డిటెక్షన్‌లో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ గంగాధరరావు రివార్డులు అందజేశారు. కంకిపాడు సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ సందీప్, హెడ్ కానిస్టేబుల్ చంద్ర, కానిస్టేబుల్స్ బాజీ, మూర్తిలను ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందించారు.
News April 11, 2025
సమస్యలు తలెత్తకుండా రీ సర్వే: కలెక్టర్ బాలాజీ

ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రీసర్వే ప్రక్రియను సజావుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పెదపారుపూడి మండలం పాములపాడులోని గ్రామ రెవెన్యూ అధికారి కార్యాలయం భవనంలో రి సర్వేకు సంబంధించిన రికార్డులను ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. గ్రామ పరిధిలో ఇప్పటివరకు పూర్తి చేసిన రిసర్వే ప్రక్రియ తలెత్తిన సమస్యలపై కలెక్టర్ బాలాజీ ఆరాతీశారు.
News April 10, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ కృష్ణా జిల్లాలో నియోజకవర్గానికి ఒక MSME పార్క్ ఏర్పాటు: కలెక్టర్
☞ కేసరపల్లి: చెరువులో పడి మహిళ మృతి
☞12 నుంచి తేలప్రోలు రంగమ్మ పేరంటాలమ్మ తిరునాళ్లు
☞గుడివాడలో ఆర్టీసీ కార్మికుల ధర్నా
☞ఇంతేరు సర్పంచి వైఖరిపై గ్రామస్థులు ఆగ్రహం
☞ పెనమలూరులో ముస్లింల నిరసన ర్యాలీ
☞ నాగాయలంకలో ఫుడ్ సేఫ్టీ అధికారి పేరుతో బెదిరింపులు.