News October 31, 2025
MBNR: RTC గుడ్ న్యూస్.. ప్రత్యేక టూర్

కార్తికమాసం సందర్భంగా శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు మహబూబ్ నగర్ డిపో మేనేజర్ సుజాత Way2Newsతో తెలిపారు. 1.పంచారామాల దర్శిని (3Days)-₹2400, 2.కాకతీయ దర్శిని (2Days)-₹1500, 3.పాలమూరు శైవ క్షేత్ర దర్శిని (2Days)-₹1400, 4.అరుణాచల దర్శిని (3Days)-₹3600, 5.వేములవాడ దర్శిని (2Days)-₹1300లకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ నిర్ణయించిందని, వివరాలకు 94411 62588, 99592 26286 సంప్రదించాలన్నారు.
Similar News
News November 1, 2025
స్పెషల్ ఆఫీసర్లు మండలాలకు వెళ్లాలి: కర్నూలు కలెక్టర్

కర్నూలు జిల్లాలో నియోజకవర్గ, మండల స్పెషల్ ఆఫీసర్లు ప్రతి వారం తప్పనిసరిగా మండలాలకు వెళ్లి ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్లు, సచివాలయాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో ఆమె మాట్లాడుతూ.. బీసీ హాస్టళ్లలో పదో తరగతి ఉత్తీర్ణతా శాతం పెంచాలన్నారు. హాస్టళ్లలో తాగునీరు, భోజనం, టాయిలెట్లపై చర్యలు చేపట్టాలని సూచించారు.
News November 1, 2025
MHBD: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు వీరే.. UPDATE

హనుమకొండ జిల్లాలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కురవి మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. కురవి మండలం సుధనపల్లికి చెందిన యువతికి బుధవారం కురవిలో వివాహం అయింది. నవ దంపతులు అదే రాత్రి అత్తగారింటికి వెళ్లారు. గురువారం నవ దంపతులను తీసుకొస్తున్న క్రమంలో ఆగి ఉన్న బొలెరోను బోర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనాథ్, స్వప్న, కళమ్మ మృతి చెందారు. మిగతా వారికి గాయాలయ్యాయి.
News November 1, 2025
ఖాళీల భర్తీలు పక్కా ఉండాలి: అనంత కలెక్టర్

ఐసీడీఎస్‌లో ఖాళీల భర్తీకి నిబంధనల ఉల్లంఘనకు తావులేదని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్)పై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 36 వర్కర్లు, 68 హెల్పర్లు కలిపి మొత్తం 104 పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.


