News October 31, 2025

పర్యాటకులకు గుడ్ న్యూస్.. విజయవాడ-అరకు డైరెక్ట్ ట్రైన్

image

విజయవాడ మీదుగా అరకు-యలహంక మధ్య స్పెషల్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. NOV 14,18,24,25న యలహంక-అరకు, 13,17,23,24న అరకు-యలహంక మధ్య ఈ రైళ్లు ప్రయాణిస్తాయని అధికారులు తెలిపారు. పై తేదీలలో యలహంక నుంచి మధ్యాహ్నం 1.30/2 గంటలకు, అరకులో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరతాయన్నారు. మార్గమధ్యంలో రాజమండ్రి, అనకాపల్లి, దువ్వాడ, తదితర స్టేషన్‌లలో ఆగుతాయన్నారు.

Similar News

News November 1, 2025

ఎమ్మిగనూరు వైసీపీ ఇన్‌ఛార్జిగా రాజీవ్ రెడ్డి

image

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో నూతన నియామకాలు చేపట్టారు. మాజీ ఎంపీ బుట్టా రేణుకను కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా, కడిమెట్ల రాజీవ్ రెడ్డిని ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జిగా నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా రాజీవ్ రెడ్డి ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు.

News November 1, 2025

నేడు సత్యసాయి జిల్లాకు సీఎం

image

సీఎం చంద్రబాబు నాయుడు నేడు సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.11:15 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, మధ్యాహ్నం 12:45కు తలుపుల మండలంలోని పెదన్నవారిపల్లికి చేరుకుంటారు. గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రజా వేదిక సమావేశం, 3:35 గంటలకు పార్టీ కేడర్‌ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5:10 గంటలకు హైదరాబాద్‌‌కు బయలుదేరుతారు.

News November 1, 2025

VZM: కళ్లద్దాల పంపిణీకు టెండర్లు స్వీకరణ

image

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంటి అద్దాలు సరఫరా చేసేందుకు టెండర్ల స్వీకరణ ప్రారంభమైందని DMHO జీవన రాణి, అంధత్వ నివారణ సంస్థాధికారి త్రినాథరావు తెలిపారు. 3,500 కళ్ల జోళ్లు పంపిణీకి గానూ ఒక కంటి అద్దం ధర ఫ్రేమ్, గ్లాస్, GST సహా రూ.280 మించకూడదన్నారు. ఆసక్తి గల వారు రూ.25,000 ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) తో నవంబర్ 5 సాయంత్రం 5 గంటల లోపు టెండర్ దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.