News October 31, 2025

KMR: పత్తి కొనుగోళ్లు వాయిదా..సోమవారం షురూ

image

మద్నూర్ పరిధిలోని 7 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ఆధ్వర్యంలో నేటి నుంచి ప్రారంభం కావాల్సిన పత్తి కొనుగోళ్లను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు KMR జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వాయిదా పడిన కొనుగోలు ప్రక్రియ సోమవారం నాడు ప్రారంభం కానుంది. రైతులు ఈ విషయాన్ని గమనించగలరు. శనివారం, ఆదివారం కొనుగోలు ప్రక్రియ జరగదని ఆమె స్పష్టం చేశారు.

Similar News

News November 1, 2025

స్పెషల్ ఆఫీసర్లు మండలాలకు వెళ్లాలి: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో నియోజకవర్గ, మండల స్పెషల్ ఆఫీసర్లు ప్రతి వారం తప్పనిసరిగా మండలాలకు వెళ్లి ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్లు, సచివాలయాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో ఆమె మాట్లాడుతూ.. బీసీ హాస్టళ్లలో పదో తరగతి ఉత్తీర్ణతా శాతం పెంచాలన్నారు. హాస్టళ్లలో తాగునీరు, భోజనం, టాయిలెట్లపై చర్యలు చేపట్టాలని సూచించారు.

News November 1, 2025

MHBD: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు వీరే.. UPDATE

image

హనుమకొండ జిల్లాలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కురవి మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. కురవి మండలం సుధనపల్లికి చెందిన యువతికి బుధవారం కురవిలో వివాహం అయింది. నవ దంపతులు అదే రాత్రి అత్తగారింటికి వెళ్లారు. గురువారం నవ దంపతులను తీసుకొస్తున్న క్రమంలో ఆగి ఉన్న బొలెరోను బోర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనాథ్, స్వప్న, కళమ్మ మృతి చెందారు. మిగతా వారికి గాయాలయ్యాయి.

News November 1, 2025

ఖాళీల భర్తీలు పక్కా ఉండాలి: అనంత కలెక్టర్

image

ఐసీడీఎస్‌లో ఖాళీల భర్తీకి నిబంధనల ఉల్లంఘనకు తావులేదని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్)పై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 36 వర్కర్లు, 68 హెల్పర్లు కలిపి మొత్తం 104 పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.