News October 31, 2025
MBNR: U-14, 17 కరాటే.. 4న ఎంపికలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్-14, 17 విభాగంలో కరాటే ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్సీఎఫ్ కార్యదర్శి Dr.ఆర్.శారదాబాయి Way2Newsతో తెలిపారు. నవంబర్ 4న మహబూబ్ నగర్‌లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్‌లో ఎంపికలు నిర్వహిస్తామని, అండర్-14 విభాగంలో 1.1.2012లో, అండర్-17 విభాగంలో 1.1.2009 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులని, ఆసక్తిగల బాల, బాలికలు పీడీ నరసింహను (94928 94606) సంప్రదించాలన్నారు.
Similar News
News November 1, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 01, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.01 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.15 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.08 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.45 గంటలకు
✒ ఇష: రాత్రి 6.58 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 1, 2025
స్పెషల్ ఆఫీసర్లు మండలాలకు వెళ్లాలి: కర్నూలు కలెక్టర్

కర్నూలు జిల్లాలో నియోజకవర్గ, మండల స్పెషల్ ఆఫీసర్లు ప్రతి వారం తప్పనిసరిగా మండలాలకు వెళ్లి ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్లు, సచివాలయాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో ఆమె మాట్లాడుతూ.. బీసీ హాస్టళ్లలో పదో తరగతి ఉత్తీర్ణతా శాతం పెంచాలన్నారు. హాస్టళ్లలో తాగునీరు, భోజనం, టాయిలెట్లపై చర్యలు చేపట్టాలని సూచించారు.
News November 1, 2025
MHBD: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు వీరే.. UPDATE

హనుమకొండ జిల్లాలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కురవి మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. కురవి మండలం సుధనపల్లికి చెందిన యువతికి బుధవారం కురవిలో వివాహం అయింది. నవ దంపతులు అదే రాత్రి అత్తగారింటికి వెళ్లారు. గురువారం నవ దంపతులను తీసుకొస్తున్న క్రమంలో ఆగి ఉన్న బొలెరోను బోర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనాథ్, స్వప్న, కళమ్మ మృతి చెందారు. మిగతా వారికి గాయాలయ్యాయి.


