News October 31, 2025
KNR: ఎకరాకు రూ.50వేల పరిహారం చెల్లించాలి: కవిత

మొంథా ప్రభావంతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 50వేల పరిహారం చెల్లించాలని జాగృతి అధ్యక్షరాలు కవిత డిమాండ్ చేశారు. KNR(D) తిమ్మాపూర్(M) నల్లగొండలో ఆమె IKP కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం తడిసినా, మొలకెత్తినా, బూజు పట్టినా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. జిల్లాలో కోతలు ప్రారంభమై నెల కావస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించడం లేదన్నారు.
Similar News
News November 1, 2025
నవంబర్ 1: చరిత్రలో ఈరోజు

1897: రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి జననం (ఫొటోలో ఎడమవైపు)
1956: ఉమ్మడి ఏపీతో పాటు కేరళ, మైసూరు, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, అస్సాం, బెంగాల్ రాష్ట్రాల ఆవిర్భావం
1966: పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఏర్పాటు
1973: నటి, మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ జననం
1974: భారత మాజీ క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్ జననం
1989: తెలుగు సినీ నటుడు హరనాథ్ మరణం
News November 1, 2025
వరంగల్: ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన ఆవు!

ఆవుకు ఒకేసారి మూడు దూడలు జన్మించిన ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. అయితే, కృతిమ గర్భం ద్వారా మేలు జాతి రకాలైన దూడలు జన్మిస్తాయని, కృత్రిమ ఏఐ ద్వారా ఈ దూడలు జన్మించాయని గోపాల మిత్ర డా.అక్బర్ పాషా తెలిపారు. దీంతో రైతు సంతోషం వ్యక్తం చేశాడు.
News November 1, 2025
RECORD: T20Iల్లో అత్యధిక పరుగులు

అంతర్జాతీయ T20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ (4,234) నిలిచారు. నిన్న SAతో జరిగిన రెండో T20లో ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత ప్లేయర్ రోహిత్ శర్మ(4,231) పేరిట ఉండేది. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో వరుసగా కోహ్లీ(4,188), బట్లర్(3,869), స్టిర్లింగ్ (3,710) ఉన్నారు. కాగా 2024 T20 WC గెలిచిన అనంతరం రోహిత్, కోహ్లీ T20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.


