News April 10, 2024
నెల్లూరు కలెక్టర్‌కే ఎంపీ టికెట్

ఒకప్పుడు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పని చేసిన వ్యక్తికే ఇక్కడి ఎంపీ టికెట్ లభించింది. ఆయన ఎవరో కాదు కొప్పుల రాజు. IAS అధికారి అయిన రాజు నెల్లూరు కలెక్టర్‌గా 1988 నుంచి 1992 వరకు పని చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. ఆ పార్టీలో కీలక పదవులు పోషించారు. రాహుల్‌కు దగ్గర మనిషి. గతంలో నెల్లూరులో పని చేసిన అనుభవం ఉండటంతో ఆయనకే కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ టికెట్ కేటాయించింది.
Similar News
News March 12, 2026
నెల్లూరు: హాల్ టికెట్లకు పూజలు

నెల్లూరు జిల్లాలో ఈనెల 16వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉత్తమ ఫలితాలు సాధించేలా అనుగ్రహించాలని కోరుతూ విద్యార్థులు జొన్నవాడ శ్రీమల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయికి పూజలు చేశారు. బుచ్చి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు ఆలయంలో హాల్ టికెట్లకు పూజలు చేయించుకున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇలాగే పూజలు చేయిస్తున్నారు.
News March 12, 2026
నెల్లూరు: ఆ నలుగురు మాజీ MLAలు సైలెంట్!

ఉదయగిరి MLAగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నాలుగుసార్లు గెలిచారు. 1994, 99లో కంభం విజయరామిరెడ్డి, 2014లో బొల్లినేని విజయం సాధించారు. ఇదే నియోజకవర్గంలోని జలదంకికి చెందిన వంటేరు వేణుగోపాల్ రెడ్డి కావలి నుంచి గెలిచారు. వీరంతా గత ఎన్నికల్లో TDP కోసం పనిచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ల అనుచరులకు కీలక పదవులు లభించలేదు. తమకు సైతం ప్రాధాన్యం లేదంటూ ఆ నలుగురు మాజీ MLAలు సైలెంట్‌గా ఉంటున్నారని టాక్.
News March 12, 2026
నెల్లూరు జిల్లాలో పెట్రోల్ పట్టడం లేదా…?

యుద్ధం ఎఫెక్ట్‌తో నెల్లూరు జిల్లాలో గ్యాస్ డెలివరీ ఆలస్యం అవుతోంది. బుకింగ్ OTPలు రావడం లేదు. కావలిలో కొందరు పెట్రోల్, డీజిల్ రావడం లేదని బంకులు మూసేస్తున్నారని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మల్లి ఆరోపించారు. జేసీబీ, మైనింగ్ లారీలకు బ్లాక్ మార్కెట్లో డీజిల్ విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. మీ ఏరియాలోనూ పెట్రోల్ బంకుల్లో ఇలాంటి సమస్య ఉంటే కామెంట్ చేయండి.


