News October 31, 2025

నరసరావుపేట కలెక్టరేట్‌లో సర్దార్ పటేల్ జయంతి

image

స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్ కృత్తికా శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి జాతీయ ఐక్యతకు పునాది వేసిన వ్యక్తి వల్లభాయ్ పటేల్ అని కలెక్టర్ కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 1, 2025

ఢిల్లీలో నేటి నుంచి ఈ వాహనాలపై బ్యాన్

image

ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించిన నేపథ్యంలో నగరంలో రిజిస్టర్ కాని, BS-VI నిబంధనలకు అనుగుణంగా లేని కమర్షియల్ వెహికల్స్‌పై ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ నిషేదం విధించింది. నేటి నుంచి వాటికి నగరంలోకి అనుమతి ఉండదు. దీని నుంచి BS-IV వాణిజ్య వాహనాలకు 2026, OCT 31 వరకు మినహాయించింది. ఢిల్లీ రిజిస్టర్డ్ కమర్షియల్ గూడ్స్ వెహికల్స్, BS-VI, CNG/LNG, ఎలక్ట్రికల్ కమర్షియల్ వాహనాలకు అనుమతి ఉంటుంది.

News November 1, 2025

బస్సు దగ్ధంపై తప్పుడు ప్రచారం: 27 మందిపై కేసు

image

కర్నూలు శివారులో జరిగిన బస్సు దగ్ధ ఘటనపై తప్పుడు సమాచారం వైరల్ చేసిన 27 మందిపై కర్నూలు తాలూకా పోలీసులు కేసులు నమోదు చేశారు. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర SM వేదికల్లో వాస్తవాలకు విరుద్ధంగా పోస్టులు చేస్తూ, తప్పుడు కోటేషన్లు పెట్టిన వారిని పోలీసులు గుర్తించారు. ప్రజల్లో భయం, గందరగోళం సృష్టించేలా ప్రచారం జరిపినందుకు గానూ ఆ యూజర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

News November 1, 2025

చిట్యాల: అత్తగారిళ్లకు చేరినా.. చెరగని స్నేహం..!

image

బాల్య స్నేహితురాళ్లు పెళ్లై బాధ్యతలు పెరిగాక బాల్య మిత్రులను మర్చిపోతుంటారు. అత్తగారింటి ఆంక్షలు, కుటుంబ బాధల్లో చిక్కుకొని పలకరింపులే కరువైన రోజులివి. కాగా, ఓ బాల్య స్నేహితురాలు ఆపదలో ఉందని తెలుసుకొని ఆసరాగా నిలిచారు చిన్ననాటి స్నేహితురాళ్లు. భూపాలపల్లికి చెందిన నర్మద అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని చిట్యాల జడ్పీహెచ్ఎస్ 2006 టెన్త్ బ్యాచ్ మిత్రురాళ్లు రూ.10 వేల ఆర్థిక సాయం చేశారు.