News October 31, 2025
అనకాపల్లి: ‘భారీ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం’

భారీ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనగలిగామని అనకాపల్లి ఎంపీ సీఎం.రమేశ్ అన్నారు. పెందుర్తి పునరావాస కేంద్రంలో బాధితులకు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబుతో కలిసి నిత్యవసర సరుకులను శుక్రవారం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం టెక్నాలజీ ఆధారంగా మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం వల్లే తక్కువ నష్టం జరిగిందన్నారు.
Similar News
News November 1, 2025
వరంగల్ కబ్జాలపై సీఎం రేవంత్ ఉక్కుపాదం

వరంగల్ వరదల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులు, నాళాలపై కబ్జాలు చేసిన వారిని ఎంత పెద్దవారైనా వదలొద్దని హెచ్చరించారు. ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌లో ఇరిగేషన్ శాఖతో అన్ని విభాగాలు సమన్వయంగా పని చేయాలని ఆదేశించారు. ముంపు ప్రభావిత కుటుంబాలకు సహాయం అందించడంలో నిర్లక్ష్యం వదలాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలని ఆదేశించారు.
News November 1, 2025
IPL: LSG హెడ్ కోచ్‌గా యువరాజ్ సింగ్?

IPL-2026లో LSG హెడ్ కోచ్‌గా యువరాజ్ సింగ్ వ్యవహరించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఆ ఫ్రాంఛైజీ ఆయనతో చర్చలు జరిపినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గత సీజన్‌లో LSG కోచ్‌గా ఆసీస్ మాజీ ప్లేయర్ జస్టిన్ లాంగర్ పనిచేశారు. పంత్ కెప్టెన్‌గా ఉన్నారు. ఈ జట్టు పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానానికి పరిమితమైంది. కాగా ఇటీవల NZ క్రికెటర్ విలియమ్సన్‌ను స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా నియమించింది.
News November 1, 2025
కామారెడ్డి: ఎస్సీ విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి

తెలంగాణ ప్రభుత్వం పేద ఎస్‌సీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య PG/PhD కోసం అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద ఆర్థిక సహాయం అందిస్తోంది. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి వెంకటేశ్ సూచించారు. www.telanganaepass.cgg.gov.in ద్వారా నవంబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.


