News April 10, 2024
కురిచేడు: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

కురిచేడు మండలంలోని పడమర నాయుడుపాలెంలో విద్యుత్‌షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పల్లె పాపయ్య(49) ఇంట్లో ఫ్యాన్ తిరగకపోవడంతో మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News October 5, 2025
ప్రకాశం ప్రజలకు పోలీస్ కీలక సూచన ఇదే!

మీ ఆధార్‌కు బయోమెట్రిక్ లాక్ ఉందా.. లేకుంటే సైబర్ నేరగాళ్లతో తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు ప్రకాశం పోలీస్. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఐటీ విభాగం పోలీసులు విస్తృతంగా సైబర్ నేరాలపై సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ఆధార్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆధార్‌కు బయోమెట్రిక్ లాక్ ఏర్పాటు చేసుకోవాలని, అప్పుడే అకౌంట్ లో ఉన్న నగదు భద్రమని పోలీసులు సూచించారు.
News October 5, 2025
అవార్డులకు వేళాయే.. కీలక ప్రకటన చేసిన ప్రకాశం కలెక్టర్!

జిల్లాస్థాయిలో స్వచ్ఛఆంధ్ర-స్వర్ణఆంధ్రకు సంబంధించి 49 అవార్డులు జిల్లాకు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఇదే విషయాన్ని కలెక్టర్ రాజాబాబు స్వయంగా ప్రకటించారు. అయితే జిల్లా స్థాయిలో స్వచ్ఛఆంధ్ర-స్వర్ణఆంధ్ర అవార్డులకు ఎంపికైన పంచాయతీలు, బస్టాండ్, ఇతర విభాగాలకు 6 తేదీన అవార్డులను ఆయా పంచాయతీలలో అందజేయనున్నారు. ఈ మేరకు ప్రకాశం కలెక్టర్ కార్యాలయం శనివారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది.
News October 4, 2025
ప్రకాశం జిల్లాలో ఉపాధి శ్రమికులకు బిగ్ అలర్ట్

ప్రకాశం జిల్లాలోని ఉపాధి హామీ కూలీలకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ శనివారం కీలక సూచన చేసింది. ఉపాధి హామీ పథకం ద్వారా పని కోరే ప్రతి శ్రామికుడు ఈ-కేవైసి చేయించుకోవాలని తెలిపింది. నవంబర్ 7లోగా ఉపాధి శ్రమికులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకొని, పని పొందటంలో ఎలాంటి ఇబ్బంది పడవద్దని సంబంధిత అధికారులు సూచించారు. అన్ని గ్రామాల్లో నిర్వహించే ఈ కేవైసీ ప్రక్రియ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.