News October 31, 2025
VKB: ‘కాంగ్రెస్ అక్రమ కేసులకు భయపడేది లేదు’

ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలన గాడితప్పి, విపక్ష నాయకులపై అక్రమ కేసులు పెడుతోందని BC కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ ఆక్షేపించారు. మాజీ CM KCRపై CBI విచారణ ఆదేశాలకు వ్యతిరేకంగా VKBలో జరిగిన ఆందోళన సందర్భంగా తమపై అక్రమ కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం ఆయన వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో హాజరయ్యారు. తాము అక్రమాలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
Similar News
News November 1, 2025
VZM: మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీకి షార్ట్ లిస్ట్ విడుదల

విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని 91 పోస్టుల భర్తీకి సంబంధించిన ఎలక్ట్రికల్ హెల్పర్, స్టోర్ అటెండెంట్, ఎలక్ట్రిషియన్ గ్రేడ్-III, ఆఫీస్ సబార్డినేట్ కేటగిరీల షార్ట్‌లిస్ట్ జాబితా విడుదలైందని ప్రిన్సిపల్ దేవి మాధవి తెలిపారు. అభ్యర్థులు జాబితాను vizianagaram.ap.gov.in, gmcvizianagaram.ap.gov.in వెబ్‌సైట్‌లలో చూడవచ్చన్నారు. అభ్యంతరాలను నవంబర్ 1, 3, 4వ తేదీల్లో లిఖితపూర్వకంగా సమర్పించవచ్చు అన్నారు.
News November 1, 2025
మైనారిటీలకు ఫ్రీగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్

AP: మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ ద్వారా శిక్షణ ఇస్తామని చెప్పారు. త్వరలో క్లాసులు ప్రారంభం అవుతాయన్నారు. అభ్యర్థులు తమ వివరాలను <
News November 1, 2025
చిత్తూరు: CKబాబు కేసులో తప్పించుకున్నా..!

ఇంజినీరింగ్ చదివిన చింటూ చిత్తూరులో బలమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా ఎదిగాడు. బెదిరింపులు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం, హత్యాయత్నం తదితర కేసులు అతనిపై ఉన్నాయి. బంగారుపాళ్యం, కర్ణాటకలో సైతం కేసులు ఉండటంతో చింటూపై రౌడీషీట్ తెరిచారు. మాజీ MLA సీకేబాబుపై హత్యాయత్నం కేసులో చింటూ అరెస్ట్ కాగా.. నేరం నిరూపణ కాలేదు. ఆ కేసులో క్లియరెన్స్ వచ్చింది. మేయర్ హత్య కేసులో మాత్రం ఉరిశిక్ష పడింది.


