News April 10, 2024

అమలాపురం MLA అభ్యర్థి ప్రకటన

image

రానున్న ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ అభ్యర్థిగా బీఎస్పీ నుంచి పాలమూరి మోహన్ పోటీ చేస్తారని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి తెలిపారు. ఉప్పలగుప్తం మండలం సరిపెల్ల గ్రామానికి చెందిన మోహన్ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్నారు. పార్టీ ఆశయాల పట్ల ఆకర్షితులై ఇటీవల బీఎస్పీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో నియోజవర్గంలో మోహన్‌ను గెలిపించాలని కోరారు.

Similar News

News November 8, 2025

రేపు రాజమండ్రిలో ఉద్యోగమేళా

image

మెప్మా, నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 9న (ఆదివారం) రాజమండ్రి సుబ్రమణ్య మైదానంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనక రాజు శనివారం తెలిపారు. విభిన్న రంగాలకు చెందిన 15కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. టెన్త్ నుంచి పీజీ, బీటెక్, నర్సింగ్ చేసిన వారు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

News November 8, 2025

ఈనెల 10న యథాతధంగా పీజీఆర్ఎస్‌: కలెక్టర్

image

పీజీఆర్ఎస్‌ కార్యక్రమం ఈనెల 10 సోమవారం యథాతధంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వ్యయప్రయాసలకు గురి కాకుండా తమ డివిజన్‌, మండల కేంద్రాలు, గ్రామ-వార్డు సచివాలయాల్లోనే అర్జీలు సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు. అలాగే 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఫిర్యాదులు ఇవ్వొచ్చని పేర్కొన్నారు.

News November 8, 2025

రాజమండ్రి: తుఫాను పంట నష్టం అంచనాలు పూర్తి

image

తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల సంభవించిన మొంథా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట నష్టం అంచనా ప్రక్రియ పూర్తయినట్లు డీఏఓ మాధవరావు శుక్రవారం వెల్లడించారు. మొత్తం 14,602 హెక్టార్లలో వరి, 1,135 హెక్టార్లలో మినుము పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. వరికి ఎకరాకు రూ.25 వేలు, మినుముకు ఎకరాకు రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.38 కోట్లకు పైగా పరిహారాన్ని రైతులకు చెల్లించనున్నట్లు ఆయన వివరించారు.