News October 31, 2025
కొట్టుకుపోయిన డీసీఎం లభ్యం.. డ్రైవర్ కోసం గాలింపు

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామం సమీపంలోని నిమ్మ వాగు వరద నీటిలో కొట్టుకుపోయిన డీసీఎం వ్యాన్ ఆచూకీ లభించింది. వరద నీరు తగ్గిపోవడంతో వాగులో డీసీఎం వ్యాన్ బయటపడింది. పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో క్రేన్ల ద్వారా ఆ వ్యాన్‌ను బయటకు తీశారు. అయితే, డ్రైవర్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో అతని కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.
Similar News
News November 1, 2025
బస్సు దగ్ధంపై తప్పుడు ప్రచారం: 27 మందిపై కేసు

కర్నూలు శివారులో జరిగిన బస్సు దగ్ధం ఘటనపై తప్పుడు సమాచారం వైరల్ చేసిన 27 మందిపై కర్నూలు తాలూకా పోలీసులు కేసులు నమోదు చేశారు. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర SM వేదికల్లో వాస్తవాలకు విరుద్ధంగా పోస్టులు చేస్తూ, తప్పుడు కోటేషన్లు పెట్టిన వారిని పోలీసులు గుర్తించారు. ప్రజల్లో భయం, గందరగోళం సృష్టించేలా ప్రచారం జరిపినందుకు గానూ ఆ యూజర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
News November 1, 2025
నేటి నుంచి చెస్ వరల్డ్ కప్

గోవా వేదికగా నేటి నుంచి ఈనెల 27 వరకు FIDE చెస్ వరల్డ్ కప్ జరగనుంది. వివిధ దేశాల నుంచి మొత్తం 206 మంది ప్లేయర్లు పాల్గొననున్నారు. చివరగా 2002లో భారత్ WCని హోస్ట్ చేసినప్పుడు విశ్వనాథన్ ఆనంద్ ఛాంపియన్‌గా నిలిచారు. ఆయనను గౌరవిస్తూ ఈ ఏడాది WCకి ఆనంద్ ట్రోఫీ అని పేరు పెట్టారు. IND నుంచి ప్రజ్ఞానంద, అర్జున్, గుకేశ్ తదితర ప్లేయర్లు పాల్గొననుండగా, కార్ల్‌సన్, కరువానా, నకమురా ఈ టోర్నీలో పాల్గొనట్లేదు.
News November 1, 2025
దేవుడు సొమ్ము సైతం గోల్‌మాల్..?

నాగులుప్పలపాడు (M) మట్టిగుంట శివాలయ వ్యవసాయ భూమి 41.5 సెంట్ల ద్వారా వచ్చే ఆదాయంలో సుమారు రూ.70 లక్షలు గల్లంతైనట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఏటా రూ.10 లక్షలకు పైగా కౌలు ఆదాయం వస్తున్నా 6 నెలలుగా అర్చకులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో రికార్డులు చూపించడంలో ప్రస్తుత EO విఫలమైనట్లు పలువురు ఆరోపించారు. రికార్డుల నిర్వహణ లోపం వల్ల ఆదాయానికి గండి పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.


