News October 31, 2025

KNL: మైనారిటీ యువతకు ఉచిత శిక్షణ

image

కర్నూలు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ యువతకు ఉచిత ఉద్యోగ శిక్షణ అందిస్తున్నట్లు ఆ శాఖ అధికారి సబీహా పర్వీన్‌ తెలిపారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్, టెట్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షల కోసం సీఈడీఎం ద్వారా ఈ శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు https://apcedmmwd.org ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని తెలియజేశారు.

Similar News

News November 1, 2025

VZM: మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీకి షార్ట్ లిస్ట్ విడుదల

image

విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని 91 పోస్టుల భర్తీకి సంబంధించిన ఎలక్ట్రికల్ హెల్పర్, స్టోర్ అటెండెంట్, ఎలక్ట్రిషియన్ గ్రేడ్-III, ఆఫీస్ సబార్డినేట్ కేటగిరీల షార్ట్‌లిస్ట్ జాబితా విడుదలైందని ప్రిన్సిపల్ దేవి మాధవి తెలిపారు. అభ్యర్థులు జాబితాను vizianagaram.ap.gov.in, gmcvizianagaram.ap.gov.in వెబ్‌సైట్‌లలో చూడవచ్చన్నారు. అభ్యంతరాలను నవంబర్ 1, 3, 4వ తేదీల్లో లిఖితపూర్వకంగా సమర్పించవచ్చు అన్నారు.

News November 1, 2025

మైనారిటీలకు ఫ్రీగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్

image

AP: మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ ద్వారా శిక్షణ ఇస్తామని చెప్పారు. త్వరలో క్లాసులు ప్రారంభం అవుతాయన్నారు. అభ్యర్థులు తమ వివరాలను <>https://apcedmmwd.org/<<>> వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 0866-2970567, 7386789966 నంబర్లలో సంప్రదించవచ్చు.

News November 1, 2025

చిత్తూరు: CKబాబు కేసులో తప్పించుకున్నా..!

image

ఇంజినీరింగ్ చదివిన చింటూ చిత్తూరులో బలమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా ఎదిగాడు. బెదిరింపులు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం, హత్యాయత్నం తదితర కేసులు అతనిపై ఉన్నాయి. బంగారుపాళ్యం, కర్ణాటకలో సైతం కేసులు ఉండటంతో చింటూపై రౌడీషీట్ తెరిచారు. మాజీ MLA సీకేబాబుపై హత్యాయత్నం కేసులో చింటూ అరెస్ట్ కాగా.. నేరం నిరూపణ కాలేదు. ఆ కేసులో క్లియరెన్స్ వచ్చింది. మేయర్ హత్య కేసులో మాత్రం ఉరిశిక్ష పడింది.