News October 31, 2025

కళ్యాణదుర్గం: బొలెరో బోల్తా.. ఒకరి మృతి

image

కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామం వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శెట్టూరు నుంచి పామిడి వైపు కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పగిలి నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 1, 2025

పోలవరం నిర్వాసితులకు రూ.1,100 కోట్లు.. నేడు చెక్కుల పంపిణీ

image

పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం తాజాగా రూ.1,100 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం ఏలూరు జిల్లా వేలేరుపాడులో జరిగే కార్యక్రమంలో నిర్వాసితులకు పరిహారం చెక్కులను అందజేయనున్నారు. జనవరిలో మిగిలిపోయిన నిర్వాసితులతో పాటు 41.15 కాంటూర్ పరిధిలో మరికొన్ని గ్రామాలకు ఈ పరిహారం అందనుంది.

News November 1, 2025

విద్యార్థుల ఖాతాల్లోకే డబ్బులు!

image

TG: ST, BC, మైనార్టీ, EBC విద్యార్థుల ఖాతాల్లోకే నేరుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ బకాయిలు ఉండటంతో కొన్ని కాలేజీలు వారి నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే అందిస్తున్న SC విద్యార్థుల తరహాలో మిగతా వారికీ అమలు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఏటా 12.5 లక్షల మంది స్టూడెంట్స్‌కు సర్కార్ రూ.2,600Cr వెచ్చిస్తోంది.

News November 1, 2025

టెక్కలిలో యువకుడిపై పొక్సో కేసు నమోదు

image

టెక్కలికి చెందిన ఓ యువకుడిపై శుక్రవారం పోలీసులు పొక్సో కేసు నమోదు చేశారు. టెక్కలి సీఐ విజయ్ కుమార్ వివరాల ప్రకారం.. తన ఇంటి సమీపంలోని మైనర్ బాలికను కొంతకాలంగా యువకుడు వేధిస్తున్నాడు. ఇటీవల తల్లితండ్రులు ఇంట్లో లేనప్పుడు బాలికకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేశారు.