News October 31, 2025

ఆసిఫాబాద్: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. రైతు ఆత్మహత్య

image

చేతికి వచ్చిన పంట తుపాన్ ప్రభావంతో నష్టపోయిందని మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ గంగన్న కథనం ప్రకారం.. లింగాపూర్(M ) సీతారాంనాయక్ తండాలో తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో తీవ్ర నిరాశకు గురైన రైతు బలిరామ్(59) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పత్తి, మొక్కజొన్న పంట దెబ్బతినడంతో పురుగుమందు తాగాడు. గురువారం సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News November 1, 2025

టెక్కలిలో యువకుడిపై పొక్సో కేసు నమోదు

image

టెక్కలికి చెందిన ఓ యువకుడిపై శుక్రవారం పోలీసులు పొక్సో కేసు నమోదు చేశారు. టెక్కలి సీఐ విజయ్ కుమార్ వివరాల ప్రకారం.. తన ఇంటి సమీపంలోని మైనర్ బాలికను కొంతకాలంగా యువకుడు వేధిస్తున్నాడు. ఇటీవల తల్లితండ్రులు ఇంట్లో లేనప్పుడు బాలికకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

News November 1, 2025

ఎంత ఇబ్బంది పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటా: జోగి రమేశ్

image

సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌లను ప్రశ్నించినందుకు తనపై దుష్ప్రచారం చేశారని మాజీ మంత్రి జోగి రమేశ్ ధ్వజమెత్తారు. కూటమి సర్కార్ తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీని బయటపెట్టానని తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదని దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేశానన్నారు. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చట్టాన్ని, వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు.

News November 1, 2025

ఉప్పు వేయడం, వేర్లు నరకడం వల్ల కొబ్బరి దిగుబడి పెరుగుతుందా?

image

చాలా చోట్ల కొబ్బరి సాగు చేస్తున్న రైతులు చెట్లకు ఉప్పు వేయడం, వేర్లు నరకడం చేస్తుంటారు. దీని వల్ల దిగుబడి పెరుగుతుందని కొందరు చెబుతుంటారు. ఏడాది వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఏడాది దిగుబడి కొంత పెరగడం కనిపిస్తుంది. కానీ తర్వాత ఏడాది నుంచి దిగుబడి తగ్గిపోతుంది. అది చెట్టుకు కూడా హాని చేస్తుంది. ఇది అశాస్త్రీయమైన పద్ధతి అని, దీన్ని పాటించకపోవడం మంచిదని ఉద్యాన పరిశోధనా నిపుణులు చెబుతున్నారు.