News October 31, 2025

అమలాపురం: నవంబర్ 4న జాబ్ మేళా

image

నిరుద్యోగ యువత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాల ద్వారా ఐటీ రంగంలో రాణించాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడారు. వికాస ద్వారా నిరుద్యోగులకు మంచి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. నవంబర్ 4వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో వికాస ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా జరుగుతుందని, ఐటీ రంగ యువత దీనిని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

Similar News

News November 1, 2025

ఖమ్మం: ‘కాపలా కాసి చంపేశారు’

image

సీపీఎం నేత సామినేని రామారావు <<18156229>>హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. రోజులాగే గ్రామంలో వాకింగ్‌కు వెళ్లి ఉ.6:15కు వచ్చారు. ఇంటి ఆవరణలోని కొట్టంలో కోళ్లు వదులుతుండగా మాటువేసిన దుండగులు కత్తులతో ఛాతి, పొట్టలో 8సార్లు పొడిచారు. కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చేసరికి రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఘటనా స్థలంలో హత్యకు వినియోగించిన కత్తిపౌచ్, ఓ జత చెప్పులు, టీషర్ట్ లభించాయి. విచారణకు సీపీ 5బృందాలు ఏర్పాటు చేశారు.

News November 1, 2025

NZB: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి నేపథ్యమిదే!

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నియమితులైన బోధన్ MLA సుదర్శన్ రెడ్డి నవీపేట్ మండలంలో 1949లో జన్మించారు. 1989లో కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1999లో బోధన్ నుంచి గెలిచి అసెంబ్లీలో తొలిసారిగా అడుగు పెట్టారు. 7 పర్యాయాలు పోటీ చేసిన ఆయన 4 సార్లు MLAగా గెలిచారు. YSR హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. 2023 ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు.

News November 1, 2025

కామారెడ్డి: కన్నీటి ‘మొంథా’.. రోడ్డుపైనే రైతన్న నిద్ర

image

మొంథా తుపాను ప్రభావంతో జిల్లాలో పలు చోట్ల కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. హైవే వెంబడి సర్వీస్ రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో వాటిని అమ్ముకోలేక, ఇంటికి తీసుకెళ్ల లేక రెండు రోజులుగా రోడ్ల పక్కనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతులు పగలు ధాన్యాన్ని ఆరబెడుతూ, రాత్రివేళ అక్కడే నిద్రపోతున్నారు. పిట్లంలోని హైవే సర్వీస్ రోడ్డుపై ఓ రైతు రాత్రి చలికి పడుకున్న దృశ్యమిది.