News October 31, 2025

17 నుంచి తిరుచానూరు బ్రహ్మోత్సవాలు

image

తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి జరగనున్నాయి. 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 17న ధ్వజారోహణం, చిన్నశేష, 18న పెద్దశేష, హంస, 19న ముత్యపుపందిరి, సింహ, 20న కల్పవృక్షం, హనుమంత, 21న పల్లకీ, గజ, 22న సర్వభూపాల, స్వర్ణరథం, గరుడ వాహన సేవ జరుగుతుంది. 23న సూర్యప్రభ, చంద్రప్రభ, 24న రథోత్సవం, అశ్వవాహనం, 25న పంచమీతీర్థం, ధ్వజావరోహణం.

Similar News

News November 1, 2025

ఖమ్మం: ‘కాపలా కాసి చంపేశారు’

image

సీపీఎం నేత సామినేని రామారావు <<18156229>>హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. రోజులాగే గ్రామంలో వాకింగ్‌కు వెళ్లి ఉ.6:15కు వచ్చారు. ఇంటి ఆవరణలోని కొట్టంలో కోళ్లు వదులుతుండగా మాటువేసిన దుండగులు కత్తులతో ఛాతి, పొట్టలో 8సార్లు పొడిచారు. కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చేసరికి రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఘటనా స్థలంలో హత్యకు వినియోగించిన కత్తిపౌచ్, ఓ జత చెప్పులు, టీషర్ట్ లభించాయి. విచారణకు సీపీ 5బృందాలు ఏర్పాటు చేశారు.

News November 1, 2025

NZB: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి నేపథ్యమిదే!

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నియమితులైన బోధన్ MLA సుదర్శన్ రెడ్డి నవీపేట్ మండలంలో 1949లో జన్మించారు. 1989లో కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1999లో బోధన్ నుంచి గెలిచి అసెంబ్లీలో తొలిసారిగా అడుగు పెట్టారు. 7 పర్యాయాలు పోటీ చేసిన ఆయన 4 సార్లు MLAగా గెలిచారు. YSR హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. 2023 ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు.

News November 1, 2025

కామారెడ్డి: కన్నీటి ‘మొంథా’.. రోడ్డుపైనే రైతన్న నిద్ర

image

మొంథా తుపాను ప్రభావంతో జిల్లాలో పలు చోట్ల కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. హైవే వెంబడి సర్వీస్ రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో వాటిని అమ్ముకోలేక, ఇంటికి తీసుకెళ్ల లేక రెండు రోజులుగా రోడ్ల పక్కనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతులు పగలు ధాన్యాన్ని ఆరబెడుతూ, రాత్రివేళ అక్కడే నిద్రపోతున్నారు. పిట్లంలోని హైవే సర్వీస్ రోడ్డుపై ఓ రైతు రాత్రి చలికి పడుకున్న దృశ్యమిది.