News October 31, 2025

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పర్యటన

image

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. NZB(D) నందిపేటలో కేదారేశ్వర ఆశ్రమాన్ని దర్శించనున్నారు. అనంతరం నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం కామారెడ్డి సఖి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఫరీద్‌పేట ఘటన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

Similar News

News November 1, 2025

పోలవరం నిర్వాసితులకు రూ.1,100 కోట్లు.. నేడు చెక్కుల పంపిణీ

image

పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పరిహారం పంపిణీ ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా రూ.1,100 కోట్లు విడుదల చేసింది. మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు వేలేరుపాడులో జరిగే కార్యక్రమంలో నిర్వాసితులకు పరిహారం చెక్కులను అందజేయనున్నారు. జనవరిలో మిగిలిపోయిన వారికి, 41.15 కాంటూర్ పరిధిలోని మరికొన్ని గ్రామాలకు చెందిన నిర్వాసితులకు ఈ పరిహారం అందనుంది.

News November 1, 2025

ఈ కోళ్లు రోజూ గుడ్లు పెడతాయని తెలుసా?

image

పౌల్ట్రీ పరిశ్రమలో అధిక గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి BV 380 రకం కోళ్లు. ఇవి వేడి, తేమ వాతావరణాలకు అనుకూలం. ఏడాదిలో 308 గుడ్లు పెట్టడం ఈ కోళ్ల ప్రత్యేకత. BV 380 కోడి పిల్లలను 18-20 వారాల పాటు పెంచిన తర్వాత అవి గోధుమ రంగులో పెద్ద గుడ్లను పెడతాయి. ఇవి ఏడాది పాటు గుడ్లు పెట్టి తర్వాత ఆపేస్తాయి. అప్పుడు వాటిని మాంసం కోసం విక్రయించవచ్చు. ✍️ రోజూ ఇలాంటి సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News November 1, 2025

పిల్లల్లో ఈ లక్షణాలున్నాయా? థైరాయిడ్ కావొచ్చు

image

ప్రస్తుతం థైరాయిడ్ వ్యాధి పిల్లలకు కూడా వస్తోంది. పిల్లల్లో ఈ సమస్యను నివారించాలంటే లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. పిల్లలు అలసిపోయినట్లు అనిపించడం, తరచూ అనారోగ్యానికి గురికావడం, చర్మం, పొడిగా, నిర్జీవంగా మారడం, మలబద్ధకం, అజీర్ణం, థైరాయిడ్ గ్రంధి పరిమాణం పెరగడం, కళ్ల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.