News October 31, 2025
BREAKING: భారత్ ఓటమి

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన 126 పరుగుల టార్గెట్‌ను 6 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలోనే ఆసీస్ ఛేదించింది. మార్ష్ 46, ట్రావిస్ హెడ్ 28, ఇంగ్లిస్ 20 పరుగులతో రాణించారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. మొదటి టీ20 రద్దవ్వగా.. మూడో టీ20 నవంబర్ 2న జరగనుంది.
Similar News
News November 1, 2025
APPLY NOW: ముంబై పోర్ట్ అథారిటీలో 116 పోస్టులు

ముంబై పోర్ట్ అథారిటీ 116 కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్, బీఈ, బీకామ్, బీఏ, బీఎస్సీ, బీసీఏ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.100. www.apprenticeshipindia.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in/
News November 1, 2025
ఇతిహాసాలు క్విజ్ – 53

1. జ్యోతిర్లింగం మొదలు, తుది తెలుసుకోలేని దేవతలు ఎవరు?
2. తారకాసురుని సంహరించింది ఎవరు?
3. దక్ష యజ్ఞాన్ని నాశనం చేసిన శివుడి ఉగ్ర రూపం పేరు?
4. శ్రీకృష్ణుడికి బాణం వేసిన వేటగాడి పేరు?
5. పంచభూత స్థలాల్లో భూమి(పృథ్వీ) లింగం ఎక్కడ ఉంది?
☛ సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
Ithihasaluquiz
News November 1, 2025
కర్నూలు ప్రమాదం: దుష్ప్రచారం చేశారంటూ 27 మందిపై కేసు

AP: కర్నూలు బస్సు దుర్ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ 27 మందిపై కేసు నమోదైంది. ఇందులో YCP అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల, సీవీ రెడ్డి, కందూరి గోపీకృష్ణ, YCP ట్విటర్ నిర్వాహకులు ఉన్నారు. కర్నూలు రూరల్(M) తాండ్రపాడుకు చెందిన వేణుములయ్య ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ప్రమాదానికి కల్తీ మద్యం, బెల్టుషాపులే <<18120317>>కారణమని<<>> ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా పోస్టులు పెట్టారని అందులో పేర్కొన్నారు.


