News October 31, 2025

విశాఖ: లెక్చరర్ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య.!

image

ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజ శుక్రవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి తేజను కాలేజీలోని ఓ మహిళా లెక్చరర్ వేధింపులకు గురిచేశారని మృతుడి కుటుంబ సభ్యులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కొన్నిరోజులుగా వేధింపులు ఎక్కువవడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News November 1, 2025

నవంబరులో మామిడి తోటల పెంపకంలో జాగ్రత్తలు

image

అక్టోబరు ఆఖరు నుంచే మామిడి చెట్లకు నీరు పెట్టడం పూర్తిగా ఆపేయాలి. లేకుంటే చెట్ల రెమ్మల్లో కొత్త ఇగుర్లు వచ్చి పూత రాకుండా పోతుంది. పూత సరిగా రాని మామిడి చెట్లలో, పూత రావడానికి ఎథ్రిల్ అనే హార్మోను మందును సిఫారసు చేస్తారు. ఈ హార్మోనును నవంబరు నెల నుంచి డిసెంబర్ వరకు 2 వారాలకు ఒకసారి చొప్పున 4 సార్లు లీటరు నీటికి 2ml చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పూత సరిగా రాని చెట్లలో ఇది మంచి ఫలితాలనిస్తుంది.

News November 1, 2025

258 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) 258 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. B.E./B.Tech/M.Tech పూర్తి చేసిన వారు అర్హులు. గేట్ స్కోర్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వయసు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. వెబ్‌సైట్: https://www.mha.gov.in/ మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News November 1, 2025

యూరియాకు గుళికలు కలిపి వాడుతున్నారా?

image

వరి సాగులో చాలా మంది రైతులు మొదటి దఫా యూరియా వేసేటప్పుడు బస్తా యూరియాకు 4-5 కిలోల గుళికల మందును కలిపి చల్లుతారు. పైరు బాగా పెరగడానికి యూరియా.. పురుగుల నివారణకు గుళికల మందు ఉపయోగపడుతుందనేది రైతుల భావన. కానీ పురుగుల కట్టడికి ఎకరాకు మందు రకాన్ని బట్టి 8-10 కిలోల గుళికలు అవసరం. తక్కువ వేస్తే పురుగులు వాటిని తట్టుకొని నిలబడతాయి. అందుకే రైతులు గుళికల మందు వాడకంలో వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం.