News October 31, 2025
జగిత్యాల: ‘నేరాల నియంత్రణ, విచారణ వేగవంతం చేయాలి’

జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నేరాల నియంత్రణ, విచారణ వేగవంతం, పెండింగ్ కేసుల పరిష్కారం, దోష నిరూపణ రేటు పెంపుపై సూచనలు ఇచ్చారు. రౌడీషీటర్లపై పర్యవేక్షణ, కొత్త షీట్స్ ఓపెన్ చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, వాహన తనిఖీలు నిరంతరంగా నిర్వహించాలన్నారు.
Similar News
News November 1, 2025
మహిళా లెక్చరర్ వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య

AP: విశాఖలో సాయితేజ్(21) అనే డిగ్రీ స్టూడెంట్ ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. సమతా కాలేజీలోని ఓ మహిళా లెక్చరర్ వేధింపులే కారణమని అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లెక్చరర్ మార్కులు సరిగా వేయకపోవడం, రికార్డులు రిపీటెడ్‌గా రాయించడం, మరో మహిళా లెక్చరర్‌తో కలిసి లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 1, 2025
‘మరో 15 రోజుల్లో సారా రహిత జిల్లాగా కాకినాడ’

రాష్ట్రంలో 25 జిల్లాలను సారా రహిత జిల్లాలుగా ప్రకటించామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మరో 15 రోజుల్లో కాకినాడ జిల్లాను కూడా నాటు సారా రహితంగా మారుస్తామని అధికారులు చెప్పారు. బెల్టు షాపులపై నిఘా మరింత పెంచాలని, రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ దుకాణాలు ఉండకూడదని అధికారులను మంత్రి ఆదేశించారు.
News November 1, 2025
HYD: మోజు తీరిన తర్వాత ముఖం చాటేశాడు!

మహిళను ఓ యువకుడు మోసం చేయగా కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సూర్యాపేటకు చెందిన డిగ్రీ విద్యార్థి రమేశ్(20)కు 2022లో బంజారాహిల్స్ ఇందిరానగర్‌లో నివసించే ఓ మహిళ(32) ఇన్‌స్టాలో పరిచయమైంది. ఆమెకు ఒక కూతురు ఉండగా భర్త చనిపోయాడు. ఈవిషయాన్ని ఆమె రమేశ్‌కు చెప్పింది. దీంతో తాను పెళ్లి చేసుకుని, తల్లీబిడ్డను బాగా చూసుకుంటానని నమ్మించాడు. మోజు తీరిన తర్వాత ముఖం చాటేయగా ఆమె PSలో ఫిర్యాదు చేసింది.


