News October 31, 2025
పెద్దపల్లి జిల్లాలో శిశు మరణాలపై సమీక్షా సమావేశం

పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.వాణిశ్రీ ఆధ్వర్యంలో శుక్రవారం శిశు మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు జిల్లాలో 26 శిశు మరణాలు నమోదయ్యాయని ఆమె తెలిపారు. తక్కువ బరువుతో, నెలలు నిండక ముందే పుట్టిన శిశువుల మరణాలపై 6 కేసులను సమీక్షించినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నివారించేందుకు వైద్య సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు.
Similar News
News November 1, 2025
కటారి దంపతులను చింటూ ఎందుకు చంపాడంటే?

మెరైన్ ఇంజినీరింగ్ చదివిన చింటూ ముంబయి, UAEలో ఉద్యోగం చేశాడు. 2003లో కటారి మోహన్ దగ్గరకు వచ్చాడు. చిత్తూరు మాజీ MLA సీకేబాబుపై చాలాసార్లు హత్యాయత్నం చేయడంతో చింటూ, మోహన్‌పై కేసులయ్యాయి. ఓ కేసులో మోహన్ జైల్లో ఉంటే చింటూ బయట అన్నీ తానై వ్యహరించాడు. మోహన్ విడుదలయ్యాక చింటూ పవర్స్ తగ్గడంతో ఆధిపత్య పోరు మొదలైంది. గ్రానైట్ వ్యాపారంలో విభేదాలు, చిత్తూరులో గేట్ వసూళ్ల వ్యవహారం హత్యకు దారి తీశాయి.
News November 1, 2025
కారంచేడు: మరణంలోనూ వీడని బంధం

కష్టసుఖాలలో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ మరణంలో కూడా ఒకరికొకరు తోడుగా ఉన్నారు ఆ దంపతులు. కారంచేడు(M) ఆదిపూడికి చెందిన పగడాల సుబ్బారావు(80), సుబ్బులు(70) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సుబ్బారావు గురువారం తీవ్ర అస్వస్థతకు గురికాగా గుంటూరు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. భార్య మంచంలోనే ఉంది. శుక్రవారం భర్త చనిపోయాడని తెలియడంతో కొన్ని గంటల్లోనే సుబ్బులు కూడా మరణించింది. నిన్న అంత్యక్రియలు నిర్వహించారు.
News November 1, 2025
భారత్ ఓటమి.. గంభీర్‌పై విమర్శలు

AUS టూర్‌లో భారత పేలవ ప్రదర్శన పట్ల కోచ్ గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి. నిన్నటి మ్యాచులోనూ టాప్ వికెట్ టేకర్ అర్ష్‌దీప్‌ను తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని AUS మాజీ ఓపెనర్ ఫించ్ అన్నారు. అర్ష్‌దీప్‌ను పక్కన పెట్టడంపై అశ్విన్ సైతం అసహనం వ్యక్తం చేశారు. అయితే అతడి ప్లేస్‌లో వచ్చిన హర్షిత్ నిన్న బ్యాటుతో రాణించాడని, గంభీర్ నిర్ణయం సరైనదేనని ఆయన ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీరేమంటారు?


