News April 10, 2024

కాంగ్రెస్‌లోకి RS ప్రవీణ్ సోదరుడు?

image

TG: నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోదరుడు ప్రసన్నకుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో సీఎం రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. కాగా తన ప్రత్యర్థి చల్లా వెంకట్రామిరెడ్డితో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ కావడంతో ప్రసన్నకుమార్ అలకబూనినట్లు టాక్. అందుకే తన సొంత అన్నతో విభేదించే పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది.

Similar News

News April 2, 2026

ASF: గ్యారంటీలపై అధికారుల గుబులు

image

ASF జిల్లాలో 335 గ్రామ పంచాయతీల్లో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ గ్రామసభలు నిర్వహించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కార మార్గాలు చూపే లక్ష్యంతో ఈ సభలు నిర్వహించనున్నారు. ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉండటంతో అధికారులు ముందస్తుగా సమాధానాలు సిద్ధం చేస్తున్నారు. గ్రామసభల్లో చేదు అనుభవాలు ఎదురవుతాయని సర్పంచులు అభిప్రాయపడుతున్నారు.

News April 2, 2026

ట్రంప్ ప్రకటన.. భారీగా పెరిగిన క్రూడాయిల్ ధర

image

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ <<19543167>>ప్రకటన<<>> నేపథ్యంలో క్రూడాయిల్ ధర భగ్గుమంది. బ్రెంట్ క్రూడ్ ధర 4 శాతం పెరిగి 105 డాలర్లకు చేరింది. అలాగే WTI బ్యారెల్ చమురు రేట్ 3 శాతం ఎగసి 103 డాలర్లుగా ఉంది. ఇక ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. ఈ ప్రభావంతో భారత మార్కెట్లు కూడా నష్టపోయే ఛాన్స్ ఉంది. అటు బంగారం, వెండి ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.

News April 2, 2026

నాగ్.. 25 నుంచి 60ఏళ్ల వరకు!

image

తన 100వ సినిమాపై నటుడు నాగార్జున ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీలో తాను 25 నుంచి 60ఏళ్ల వయస్సు వరకు పలు గెటప్స్‌లో కనిపించనున్నట్లు తెలిపారు. యువకుడిగా కనిపించడానికి డీ-ఏజింగ్ టెక్నిక్ వాడుతున్నామన్నారు. తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే సెంటిమెంట్ చుట్టూ కథ ఉంటుందని వెల్లడించారు. తమిళ డైరెక్టర్ RA కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి కింగ్ 100, లాటరీ కింగ్ తదితర పేర్లు పరిశీలిస్తున్నారు.