News October 31, 2025
PDPL: ‘దేశ ఐక్యత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి’

జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం, కలెక్టరేట్ IT ప్రాంగణం నుంచి చౌరస్తా వరకు నిర్వహించిన 2 కి.మీ. ‘యూనిటీ ఫర్ రన్’ ర్యాలీని ఆయన ప్రారంభించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Similar News
News November 1, 2025
నాగార్జున యూనివర్సిటీ రెగ్యులర్ ఫలితాలు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో మార్చి/జులై 2025లో నిర్వహించిన B.TECH, M. TECH రీవాల్యుయేషన్ ఫలితాలను శుక్రవారం పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. I/IV బి.టెక్ II సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్ 68.43%, II/II ఎం.టెక్ III సెమిస్టర్ 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. జవాబు పత్రాల రీవాల్యుయేషన్ కోసం నవంబర్ 10లోపు ఒక్కొక్క సబ్జెక్టుకు రూ.2070 చెల్లించాలన్నారు.
News November 1, 2025
విజయవాడ: ఈ నెల 7న మెగా జాబ్ మేళా

విజయవాడలోని SRR కళాశాలలో ఈ నెల 7న APSSDC ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. 30 కంపెనీలు పాల్గొనే ఈ మేళాకు SSC, ITI, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 35 ఏళ్లలోపు అభ్యర్థులు హాజరవ్వాలని, ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.10-35 వేల వేతనం ఉంటుందన్నారు. https://naipunyam.ap.gov.in/లో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు.
News November 1, 2025
ఎన్టీఆర్: CRDA జాబ్ మేళాలో 141 మందికి ఉద్యోగాలు

తుళ్లూరులో CRDA, APSSDC ఆధ్వర్యంలో శుక్రవారం 10 కంపెనీలు నిర్వహించిన జాబ్ మేళాలో 141 మందికి ఉద్యోగాలు లభించాయని కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. అమరావతిలో 380 ఉద్యోగాల భర్తీకై నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 627 మంది హాజరవ్వగా 141 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని, మరో 43 మంది ఇంటర్వ్యూలోని తదుపరి రౌండ్లకు ఎంపికయ్యారని కమిషనర్ పేర్కొన్నారు.


