News October 31, 2025

ఒంటికొస్తే.. దర్జాగా ఫైవ్ స్టార్ హోటల్‌కి వెళ్లొచ్చు!

image

షాపింగ్స్ తదితర అవసరాల కోసం పట్టణాలకు వెళ్లినప్పుడు, ప్రయాణాల్లో టాయిలెట్స్ దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అయితే ‘Sarais Act, 1867 Section 7(2)’ ప్రకారం దేశంలో ఫైవ్ స్టార్ హోటల్‌తో సహా ఏ హోటల్‌కైనా వెళ్లి టాయిలెట్స్ వాడుకునే హక్కు ఉందనే విషయం చాలామందికి తెలియదు. అలాగే అక్కడ నీరు తాగే హక్కు కూడా ఉంది. ప్రజల సౌకర్యం కోసం తీసుకొచ్చిన ఈ హక్కును అవసరమైనప్పుడు ఉపయోగించుకోండి. SHARE IT

Similar News

News November 1, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

✦ జూబ్లీహిల్స్ బైపోల్: ఇవాళ రాత్రి బోరబండ, ఎర్రగడ్డలో CM రేవంత్ ప్రచారం
✦ నేడు సా.6 గంటలకు రహమత్ నగర్‌లో KTR రోడ్ షో
✦ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కొత్తగా 75 PG సీట్లు మంజూరు చేసిన NMC.. 1390కి చేరిన సీట్ల సంఖ్య
✦ భవిత కేంద్రాల్లో పని చేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకూ TET మినహాయింపు కుదరదు: హైకోర్టు
✦ గద్వాల(D) ధర్మవరం BC హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. 86 మంది విద్యార్థులకు అస్వస్థత

News November 1, 2025

పంటకు ఎరువులను ఇలా అందిస్తే ఎక్కువ లాభం

image

అవసరాన్ని బట్టి మాత్రమే యూరియాను పంటకు వేసుకోవాలి. మోతాదుకు మించి యూరియా వాడటం వల్ల చీడపీడల ఉద్ధృతి ఎక్కువై పంటల దిగుబడి తగ్గుతుంది. సిఫారసు చేసిన మొత్తం నత్రజని ఎరువులను ఒకే దఫాలో కాకుండా 3 దఫాలుగా (నాటిన/విత్తిన తర్వాత, శాఖీయ దశలో, పూతకు ముందు) వేయడం వల్ల పంటకు ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చు.
సూక్ష్మపోషకాలను పంటలకు స్ప్రే రూపంలో అందిస్తే మొక్క వేగంగా గ్రహిస్తుంది.

News November 1, 2025

IUCTEలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(IUCTE)10 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేటెడ్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: www.iucte.ac.in