News October 31, 2025

NTR: వైద్యశాఖలో 107 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

నేషనల్ ఆయుష్ మిషన్‌లో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ విధానంలో 107 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు https://apmsrb.ap.gov.in/msrb/లో నవంబర్ 1 నుంచి 15లోపు దరఖాస్తు చేసుకోవాలని AP మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ M.V. సూర్యకళ తెలిపారు. దరఖాస్తు విధానం, వేతనం తదితర వివరాలకు పై వెబ్‌సైట్ చూడాలన్నారు.

Similar News

News November 1, 2025

పబ్జి గేమ్ ఆడుతున్న యువకుడితో గొడవ.. హత్య

image

యువకుడు హత్యకు గురైన ఘటన గండేపల్లి(M) ఎర్రంపాలెంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామంలోని రహదారిపై నిన్న రాత్రి 11గంటల తర్వాత పబ్జీ గేమ్ ఆడుతున్న బొంగా బాబ్జి(17)ని కాకర చిన్ని(50) అనే వ్యక్తి వారించాడు. దొంగతనాలు జరుగుతున్నాయని.. రోడ్డుపై ఈ టైం వరకు ఎందుకు, ఇంటికెళ్లమని చెప్పాడు. దీంతో బాబ్జి అతనితో ఘర్షణకు దిగాడు. గొడవ పెద్దదై బాబ్జీని కాకర చిన్ని కత్తితో మెడపై పొడవడంతో మృతి చెందాడు.

News November 1, 2025

జగిత్యాల: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి సూసైడ్

image

ఆర్థిక ఇబ్బందులతో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మం. చిట్టాపూర్‌కు చెందిన ఏనుగు ప్రతాప్ రెడ్డి(38) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేళ్లక్రితం గల్ఫ్ వెళ్లిన ఇతను అనారోగ్యంతో ఇటీవలే ఇంటికి తిరిగొచ్చాడు. రూ.10లక్షల వరకు అప్పు అవ్వడంతో మనోవేదనకు గురై ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ప్రతాప్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు SI రాజు తెలిపారు.

News November 1, 2025

నార్త్ యూరప్‌లో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్!

image

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో Jr.NTR హీరోగా నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారంలో పునః ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. నార్త్ యూరప్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయాలని డైరెక్టర్ నీల్ ప్లాన్ చేసినట్లు పేర్కొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.