News October 31, 2025
మీ డబ్బు – మీ హక్కు’ ప్రచార పోస్టర్ ఆవిష్కరణ

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు నెలల పాటు ప్రారంభించిన ‘మీ డబ్బు – మీ హక్కు’ (Your Money – Your Right) ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి శుక్రవారం కలెక్టరేట్‌లో పోస్టర్‌ను విడుదల చేశారు. పౌరులు తమ పేరు మీద ఉండి, క్లెయిమ్ చేయని లేదా మరిచిపోయిన ఆర్థిక ఆస్తులను తిరిగి పొందేందుకు ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తుందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.
Similar News
News November 1, 2025
ఆసుపత్రిలో జేసీ..!

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి జర్మనీలో శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. కొన్నిరోజులుగా భుజం నొప్పితో బాధపడుతున్న ఆయన డాక్టర్ల సూచన మేరకు అక్కడ సర్జరీ చేయించుకున్నారు. నిపుణుల వైద్య బృందం ఆయనకు చికిత్స చేసింది. జేసీ ఆసుపత్రిలో ఉన్న ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. కొన్నిరోజులు విశ్రాంతి అనంతరం ఆయన తాడిపత్రికి రానున్నారు.
News November 1, 2025
10కి తక్కువ లేదా 150కి ఎక్కువ.. ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు

బిహార్ ఎన్నికల్లో తాము 10 కన్నా తక్కువ లేదా 150 కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తామని జన్ సురాజ్ పార్టీ ఫౌండర్ ప్రశాంత్ కిశోర్ అన్నారు. ‘రాష్ట్ర ప్రజలు మా పార్టీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఎన్డీయేకు, ప్రతిపక్ష కూటమికి ఓటు వేయాలని వారు అనుకోవట్లేదు. 160-170 సీట్లలో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్నికలకు ముందు, తర్వాత ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టంచేశారు.
News November 1, 2025
ఇంటి చిట్కాలు

* జిడ్డు పట్టిన గ్యాస్ లైటర్‌కు నిమ్మకాయ ముక్కను, బేకింగ్ సోడాలో అద్ది లైటర్‌పై రాసి మళ్ళీ క్లాత్‌తో తుడిస్తే గ్యాస్ లైటర్ మెరిసిపోతుంది.
* నెయిల్ పాలిష్ క్లీనర్‌తో తుడిస్తే ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులపై మరకలు పోతాయి.
* ఒక కప్పు వేడి నీటిలో 2 చెంచాల వెనిగర్ వేసి బాగా కలిపి, వాషింగ్ మెషీన్ మరకలపై స్ప్రే చేసి కాసేపు అలాగే ఉంచాలి. తర్వాత క్లీనింగ్ బ్రష్‌తో శుభ్రం చేస్తే మరకలు ఈజీగా తొలగిపోతాయి.


