News October 31, 2025

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త

image

AP: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు RTC ఆస్పత్రులతోపాటు EHS హాస్పిటల్స్‌లోనూ ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020 JAN 1 తర్వాత రిటైరైన వారికి ఈ సౌకర్యం వర్తించనుంది. సూపరింటెండెంట్ కేటగిరీ వరకు ₹38,572, అసిస్టెంట్ మేనేజర్, ఆపై ర్యాంకు ఉన్నవారు ₹51,429 ఓసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం చికిత్స పొందవచ్చు. రెగ్యులర్ ఉద్యోగుల్లా రీయింబర్స్‌మెంట్ సౌకర్యమూ ఉంటుంది.

Similar News

News November 1, 2025

కాశీబుగ్గ తొక్కిసలాట.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

image

AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో 10మంది భక్తులు మృతి చెందడంపై PM మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాటలో భక్తులు మరణించడం దురదృష్టకరమని Dy.CM పవన్ ట్వీట్ చేశారు.

News November 1, 2025

ఇంతమంది వస్తారని అనుకోలేదు: హరిముకుంద్

image

AP: శ్రీకాకుళం కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాటపై నిర్వాహకుడు 95 ఏళ్ల హరిముకుంద్ పండా స్పందించారు. ఇంతమంది భక్తులు వస్తారని ఊహించలేదని చెప్పారు. భక్తులు విపరీతంగా వచ్చారని, గతంలో ఎప్పుడూ ఇంతమంది రాలేదని తెలిపారు. కాగా గతంలో తిరుమలకు వెళ్లిన హరిముకుంద్‌కు సంతృప్తిగా స్వామివారి దర్శనం కలగలేదు. దీంతో తనకు గల 50 ఎకరాల్లో 10 ఎకరాల్లో ఆలయం నిర్మించారు.

News November 1, 2025

వేలానికి బంగారు టాయిలెట్.. ప్రారంభ ధర ₹83Cr!

image

బంగారంతో తయారుచేసిన టాయిలెట్ కమోడ్ వేలానికి సిద్ధమైంది. ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటెలాన్ ఈ విచిత్ర కళాఖండానికి ‘అమెరికా’ అని పేరు పెట్టారు. ధనవంతుల అహంకారం, వారి ఆర్భాటపు జీవితం ఎంత నిష్ఫలమో ఈ ‘గోల్డ్ టాయిలెట్’ ద్వారా సందేశం ఇస్తున్నట్లు సృష్టికర్త పేర్కొన్నారు. న్యూయార్క్‌లో నవంబర్ 18న వేలం జరగనుంది. ప్రారంభ ధర ₹83 కోట్లుగా నిర్ణయించారు.