News October 31, 2025
పెద్దపల్లి: ‘మహాసభలను విజయవంతం చేయాలి’

PDPL అమరవీరుల స్థూపం వద్ద పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ మహాసభలు NOV 8, 9 తేదీల్లో HYDలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరుగనున్నాయి. “ఆపరేషన్ కగార్ వ్యతిరేకిద్దాం-జీవించే హక్కును కాపాడుకుందాం” అనే అంశంపై సభలు, చర్చలు, ఐక్యత సందేశాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కమిటీ పిలుపునిచ్చింది.
Similar News
News November 1, 2025
ప్రొద్దుటూరులో బయటపడిన శ్రీ కృష్ణదేవరాయ శిలా శాసనం

ప్రొద్దుటూరులోని సినీ హబ్ శనివారం ఇంటి నిర్మాణం కోసం జేసీబీతో తవ్వుతుండగా శ్రీకృష్ణదేవరాయ శిలాశాసనం బయట పడినట్లు భారత పురావస్తు పరిశోధన డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు. ఇది క్రీస్తు శకం 1523 కాలం నాటిదన్నారు. శ్రీకృష్ణదేవరాయలు తిరుమల దేవి పుణ్యం కోసం కావులూరులో చెన్నకేశవ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లు వెల్లడించారు. క్రీస్తు శకం 1523 జనవరి 24 శనివారం ఈ శిలా శాసనం వేయించారన్నారు.
News November 1, 2025
ప్రకృతి సేద్యంలో వరి సాగు – ఆకునల్లి, పచ్చదోమ నివారణ

☛ ఆకునల్లి నివారణకు గట్ల మీద బంతి మొక్కలు నాటాలి. పంట మీద ఆవుపేడ, ఆవు మూత్రం, ఇంగువతో చేసిన 5 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.
☛ పచ్చదోమ నివారణకు పసుపు, తెల్లని జిగురు అట్టలను ఎకరానికి 20-25 చొప్పున అమర్చుకోవాలి. ఎకరానికి ఒక లైట్ ట్రాప్ (దీపపు ఎర)ను పెట్టాలి. 100 లీటర్ల నీటికి 5లీటర్ల వావిలాకు కషాయాన్ని కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.
News November 1, 2025
VKB: ‘సకాలంలో బియ్యం అందించాలి’

జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధ్యక్షతన శనివారం వికారాబాద్ కలెక్టరేట్‌లో రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల అధికారులతో సమీక్ష జరిగింది. ఖరీఫ్ సీఎంఆర్ బ్యాంకు గ్యారంటీలు, అగ్రిమెంట్లు వంటి అంశాలపై చర్చించారు. రైస్ మిల్లర్ల వద్ద ఉన్న సీఎంఆర్‌ను నవంబర్ 12 లోపు అందజేయాలని సూచించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు.


