News October 31, 2025
లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కట్టవచ్చా?

లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడం ప్రమాదకరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘ఇలాంటి ప్రాంతాల్లో నిర్మించిన గృహాల్లోకి వర్షాకాలంలో నీరు వచ్చే అవకాశాలుంటాయి. ఇంట్లోకి తేమ చేరితే అనారోగ్యం వస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో సౌరశక్తి, ప్రాణశక్తి కూడా తక్కువే. దీనివల్ల నివాసంలో నిరుత్సాహం ఏర్పడుతుంది. స్థిరమైన, సుఖమైన జీవనం కోసం ఎత్తుగా, సమతలంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి’ అని తెలిపారు.<<-se>>#Vasthu<<>>
Similar News
News November 1, 2025
ప్రకృతి సేద్యంలో వరి సాగు – ఆకునల్లి, పచ్చదోమ నివారణ

☛ ఆకునల్లి నివారణకు గట్ల మీద బంతి మొక్కలు నాటాలి. పంట మీద ఆవుపేడ, ఆవు మూత్రం, ఇంగువతో చేసిన 5 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.
☛ పచ్చదోమ నివారణకు పసుపు, తెల్లని జిగురు అట్టలను ఎకరానికి 20-25 చొప్పున అమర్చుకోవాలి. ఎకరానికి ఒక లైట్ ట్రాప్ (దీపపు ఎర)ను పెట్టాలి. 100 లీటర్ల నీటికి 5లీటర్ల వావిలాకు కషాయాన్ని కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.
News November 1, 2025
ఎల్లుండి నుంచి మెట్రో రైలు సమయాల్లో మార్పు

TG: మెట్రో రైలు సమయాల్లో మార్పు చోటు చేసుకోనుంది. తొలి ట్రైన్ ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ రాత్రి 11 గంటలకు అన్ని టర్మినల్ స్టేషన్ల నుంచి మొదలవుతాయని L&T హైదరాబాద్ మెట్రో పేర్కొంది. ఎల్లుండి నుంచి కొత్త టైమింగ్స్ అందుబాటులోకి వస్తాయని ప్రకటనలో తెలిపింది. అంతకుముందు తొలి ట్రైన్ ఉదయం 6గంటలకు, చివరి ట్రైన్ రాత్రి 11:45గంటలకు మొదలైన సంగతి తెలిసిందే.
News November 1, 2025
ఢిల్లీలో వాయు కాలుష్యంతో 17,188 మరణాలు

ఢిల్లీలో సంభవించిన మరణాల్లో ఏడింటిలో ఒక మరణానికి వాయుకాలుష్యమే కారణంగా ఉంది. 2023లో వాయుకాలుష్యం వల్ల 17,188(15%) మంది మరణించినట్లు ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్ అండ్ ఎవాల్యూయేషన్(IHME) నివేదిక తెలిపింది. అదే ఏడాది హైబీపీతో 12.5%, మధుమేహంతో 9శాతం, అధిక కొలెస్ట్రాల్‌తో 6%, ఊబకాయంతో 5.6శాతం మరణాలు చోటు చేసుకున్నాయి. 2018-24 మధ్య కాలంలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ ఉంది.


