News October 31, 2025

రవితేజ ‘మాస్ జాతర’ రివ్యూ&రేటింగ్

image

గంజాయి ముఠాను సిన్సియర్ రైల్వే పోలీసు ఎలా అంతం చేశాడనేదే ‘మాస్ జాతర’ స్టోరీ. రవితేజ లుక్, ఎనర్జీ, ఫైట్స్, డైలాగ్స్‌తో అదరగొట్టారు. అక్కడక్కడ కామెడీ సీన్లు నవ్వు తెప్పిస్తాయి. BGM, సాంగ్స్ ఆకట్టుకుంటాయి. రొటీన్ కమర్షియల్ స్టోరీ, కథలో బలం లేకపోవడం, ఔట్‌డేటెడ్ స్క్రీన్ ప్లే నిరాశ పరుస్తాయి. మధ్యమధ్యలో కొన్ని అనవసర సీన్లు చికాకు తెప్పిస్తాయి.
RATING: 2.5/5

Similar News

News November 1, 2025

ఎకరాకు రూ.25వేల పరిహారం ఇవ్వాలి: షర్మిల

image

AP: మొంథా తుఫాను రైతుల పాలిట మహావిపత్తు అని కాంగ్రెస్ స్టేట్ చీఫ్ షర్మిల అన్నారు. తుఫాన్ ప్రభావంతో రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లితే సీఎం చంద్రబాబు తక్కువ చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. పరిహారం ఇవ్వలేక ఇలా చేస్తున్నారని విమర్శించారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విపత్తును కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించి, ఉచిత పంట బీమా పథకాన్ని తిరిగి అమలు చేయాలన్నారు.

News November 1, 2025

107 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

AP: విజయవాడలో ఉన్న ఆయుష్ విభాగంలో 107 ఉద్యోగాల భర్తీకి APMSRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ రిక్రూట్‌మెంట్ జరగనుంది. పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంకామ్, MBA, CA, ICWA, MD, BAMS, BHMS, BUMS, BNYS పాసవ్వడంతోపాటు APMCలో రిజిస్ట్రేషన్ ఉండాలి. అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఈ నెల 15 వరకు అప్లై చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: https://apmsrb.ap.gov.in/msrb/

News November 1, 2025

ఇక్కడ ఒకరాత్రి బస ఖర్చు ₹88 లక్షలు

image

ప్రపంచంలో అత్యంత ఖరీదైన హోటళ్లు అనేకం. వాటిలో జెనీవా(స్విట్జర్లాండ్‌)లోని ప్రెసిడెంట్ విల్సన్ ప్రత్యేకతే వేరు. ఇక్కడి పెంట్‌హౌస్ సూట్‌కు ఒకరాత్రి బస ఖర్చు ₹88 లక్షలు. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, 12 పడగ్గదులు ఉండే ఇందులో PA, చెఫ్, బట్లర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారు. హైప్రొఫైల్ వ్యక్తులు ఇందులో దిగుతుంటారు. 8 అంతస్తుల ఈ హోటల్ నుంచి జెనీవా లేక్‌, ఆల్ప్స్ పర్వతాల మధ్య సన్‌సెట్ ఎంతో అనుభూతి ఇస్తుంది.