News October 31, 2025

జనగామ: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి!

image

ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యబోధన అందించాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నారు. విడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జనగామ నుంచి కలెక్టర్ రిజ్వాన్ భాషా పాల్గొన్నారు.

Similar News

News November 1, 2025

శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపుతున్న దొంగతనాలు

image

జిల్లాలో వరుస చోరీ ఘటనలు ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. తూ.గో జిల్లా నుంచి వచ్చి ఇక్కడ చోరీలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. ఈ నెల 10న నరసన్నపేటలో ట్రాన్స్‌జెండర్లు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. తాజాగా కాశీబుగ్గలో చోరీ, సారవకోట(M) బుడితిలో వృద్ధురాలి మెడలో బంగారం చోరీ చేశారు. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులున్న AP, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నారు.

News November 1, 2025

నేడు లండన్‌ వెళ్లనున్న సీఎం దంపతులు

image

AP: CM చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ఇవాళ లండన్ వెళ్లనున్నారు. ఈనెల 4న ఆమె డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ <<17985147>>అవార్డును<<>> అందుకోనున్నారు. అలాగే హెరిటేజ్ ఫుడ్స్‌ తరఫున గోల్డెన్ పీకాక్ పురస్కారాన్నీ భువనేశ్వరి స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన అనంతరం CM చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. విశాఖలో జరిగే CII సదస్సుకు వారిని ఆహ్వానిస్తారు. ఈనెల 6న తిరిగి అమరావతి చేరుకుంటారు.

News November 1, 2025

పోలవరం నిర్వాసితులకు రూ.1,100 కోట్లు.. నేడు చెక్కుల పంపిణీ

image

పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పరిహారం పంపిణీ ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా రూ.1,100 కోట్లు విడుదల చేసింది. మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు వేలేరుపాడులో జరిగే కార్యక్రమంలో నిర్వాసితులకు పరిహారం చెక్కులను అందజేయనున్నారు. జనవరిలో మిగిలిపోయిన వారికి, 41.15 కాంటూర్ పరిధిలోని మరికొన్ని గ్రామాలకు చెందిన నిర్వాసితులకు ఈ పరిహారం అందనుంది.