News October 31, 2025
రోడ్డు మరమ్మత్తుల్లో నాణ్యత పాటించాలి: కలెక్టర్

రోడ్ల మరమ్మతుల విషయంలో ఎలాంటి అలసత్యం లేకుండా వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షానికి సూర్యాపేట దంతాలపల్లి రోడ్లు గుంటలు ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కలెక్టర్ ఈరోజు పరిశీలించి ఆర్అండ్‌బి అధికారులను మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. నాణ్యతతో పాటు రహదారులు ఎక్కువ కాలం ఉండేలా నాణ్యత పనులను చేపట్టేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
Similar News
News November 1, 2025
సిరిసిల్ల: ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ముగ్గురి అరెస్ట్

సిరిసిల్ల పట్టణంలో కత్తులు పట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ తెలిపారు. సుందరయ్య నగర్ సిక్కువాడకు చెందిన బురహాని నర్సింగ్, రాజేష్ సింగ్, బురణి గోపాల్ సింగ్‌లు పెద్ద కత్తులు పట్టుకొని రోడ్లపైకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
News November 1, 2025
వనపర్తి: కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్

పెండింగ్ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ సరైన వేదిక అని వనపర్తి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజని అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీస్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. కోర్టుల్లో కేసులు పెండింగ్ లేకుండా సత్వర పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని ఆమె కోరారు. ఈ నెల 15న నిర్వహించే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకునేలా ఇరువర్గాలకు అవగాహన కల్పించాలని సూచించారు.
News November 1, 2025
అక్షతలు తలపైన వేసుకుంటే…

శాస్త్రం ప్రకారం.. అక్షతలు శుభాన్ని సూచిస్తాయి. అందుకే శుభ కార్యాల్లో, పండుగలప్పుడు వీటిని ఉపయోగిస్తారు. అక్షతలను ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోవాలని పెద్దలు సూచిస్తారు. ఇవి ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు చేకూరుతాయని నమ్మకం. పూజలో వాడిన అక్షతలను దాచుకుని, ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు వాటిని తలపైన వేసుకోవాలట. ఇలా చేస్తే చేయాలనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని నమ్మకం.


