News October 31, 2025

పెద్దపల్లి: ‘NOV 11న యువజనోత్సవ పోటీల నిర్వహణ’

image

PDPL యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో NOV 11న 29వ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువజన ఉత్సవ పోటీలు నిర్వహించనున్నట్లు డీవైఎస్‌ఓ సురేష్ తెలిపారు. జానపద నృత్యం, గేయం, కథారచన, పెయింటింగ్, కవిత్వం, ఇన్నోవేషన్ ట్రాక్ పోటీలు జరగనున్నాయి. జిల్లాస్థాయిలో విజేతలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అవుతారని చెప్పారు. ఆసక్తిగల యువతీ యువకులు PDPL అమర్‌నగర్ సిరి ఫంక్షన్ హాల్‌లో జరిగే పోటీలలో పాల్గొనాలని పిలుపునచ్చారు.

Similar News

News November 1, 2025

సిరిసిల్ల: ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ముగ్గురి అరెస్ట్

image

సిరిసిల్ల పట్టణంలో కత్తులు పట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ తెలిపారు. సుందరయ్య నగర్ సిక్కువాడకు చెందిన బురహాని నర్సింగ్, రాజేష్ సింగ్, బురణి గోపాల్ సింగ్‌లు పెద్ద కత్తులు పట్టుకొని రోడ్లపైకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.

News November 1, 2025

వనపర్తి: కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్

image

పెండింగ్ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ సరైన వేదిక అని వనపర్తి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజని అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీస్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. కోర్టుల్లో కేసులు పెండింగ్ లేకుండా సత్వర పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని ఆమె కోరారు. ఈ నెల 15న నిర్వహించే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకునేలా ఇరువర్గాలకు అవగాహన కల్పించాలని సూచించారు.

News November 1, 2025

అక్షతలు తలపైన వేసుకుంటే…

image

శాస్త్రం ప్రకారం.. అక్షతలు శుభాన్ని సూచిస్తాయి. అందుకే శుభ కార్యాల్లో, పండుగలప్పుడు వీటిని ఉపయోగిస్తారు. అక్షతలను ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోవాలని పెద్దలు సూచిస్తారు. ఇవి ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు చేకూరుతాయని నమ్మకం. పూజలో వాడిన అక్షతలను దాచుకుని, ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు వాటిని తలపైన వేసుకోవాలట. ఇలా చేస్తే చేయాలనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని నమ్మకం.