News November 1, 2025
మెదక్ జిల్లా ఇందిరాగాంధీని మర్చిపోదు: మంత్రి

ఉమ్మడి మెదక్ జిల్లా ఇందిరాగాంధీని ఎప్పటికీ మర్చిపోదని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మునిపల్లి మండలం పెద్ద చల్మెడ గ్రామంలో ఆమె చిత్రపటానికి శుక్రవారం సాయంత్రం పూలమాలవేసి నివాళి అర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. జిల్లాకు కేంద్ర పరిశ్రమలు తీసుకువచ్చిన ఘనత ఇందిరా గాంధీకి దక్కుతుందని చెప్పారు.
Similar News
News November 1, 2025
ఓల్డ్ గూగుల్ క్రోమ్ వాడుతున్నారా?

ఓల్డ్ వెర్షన్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నవారికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని CERT-In హెచ్చరికలు జారీ చేసింది. పాత వెర్షన్లలో తీవ్రమైన భద్రతా లోపాలున్నాయని, దీనివల్ల యూజర్ల వ్యక్తిగత సమాచారం లీకయ్యే ప్రమాదముందని తెలిపింది. లైనక్స్, విండోస్, macOSలో 142.0.7444.59/60 కంటే ముందున్న వెర్షన్లు వాడుతుంటే వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
News November 1, 2025
ఆసిఫాబాద్: విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి

ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం ASF జిల్లా కలెక్టరేట్‌లో విద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
News November 1, 2025
ADB: జాతీయ గౌరవ దివాస్‌లో పాల్గొన్న ఎంపీ నగేశ్

హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ గౌరవ దివాస్ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బీర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులతో పోరాడి అమరుడైన గొప్ప నాయకుడు బీర్సా ముండా అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో MLA పాయల్ శంకర్ పాల్గొన్నారు.


