News April 10, 2024

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!

image

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్. ప్రభాస్-మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ‘రాజాసాబ్’ మూవీ షూటింగ్‌లో మెజారిటీ పార్ట్ పూర్తయిందట. మిగిలిన సీన్స్ ‘సలార్2’తో పాటు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే సంక్రాంతికి ఈ సినిమా అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోందట. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Similar News

News February 19, 2026

BJPని పీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలి: అర్వింద్

image

TG: రాష్ట్రంలో BJPని 20 ఏళ్లుగా కొందరు కోవర్టులు పట్టి పీడిస్తున్నారని నిజామాబాద్ MP అర్వింద్ వ్యాఖ్యానించారు. అలాంటి వారు వెంటనే పార్టీని వీడి వెళ్లాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉత్తర భాగంలో పార్టీ పటిష్ఠంగా ఉందని, దక్షిణ ప్రాంతంలోనే మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నారు. ‘ఎవరి వల్ల ఎవరు భూస్థాపితం అయ్యారో కవితకు తెలియదా? కేసుల వల్లే నిజామాబాద్‌లో BRS కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది’ అని విమర్శించారు.

News February 19, 2026

వంట చేసేటపుడు ఈ తప్పులు చేస్తున్నారా?

image

ఆరోగ్యంగా ఉండాలంటే వంట చేసే విధానం కూడా ముఖ్యమేనంటున్నారు నిపుణులు. ముఖ్యంగా డీప్ ఫ్రైడ్, ఎయిర్ ఫ్రైయర్‌లో వంటలు చేస్తున్నప్పుడు అధిక ఉష్ణోగ్రత వద్ద హెటెరోసైక్లిక్ అమైన్, పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్, నాన్‌స్టిక్ పాన్లలో వంట చేయడం వల్ల విషపూరిత పదార్థాలు విడుదలవుతాయంటున్నారు. వీటికి బదులుగా బేకింగ్, రోస్టింగ్, తక్కువమంటపై వండటం వల్ల ఆహారంలో పోషకాలు నశించకుండా ఉంటాయని సూచిస్తున్నారు.

News February 19, 2026

త్వరలో 2,947 పోస్టుల భర్తీ: మంత్రి రవికుమార్

image

AP: ఈపీడీసీఎల్ పరిధిలో 2,947 ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి రవికుమార్ అసెంబ్లీలో ప్రకటించారు. 581 ఎనర్జీ అసిస్టెంట్లు, 1,260 జూనియర్ లైన్‌మెన్, 1,084 అసిస్టెంట్ లైన్‌మెన్, 22 లైన్‌మెన్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 8,770 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందితో విధులను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.