News November 1, 2025

భీమారం: రైతులు ఆందోళన చెందొద్దు: కలెక్టర్

image

భీమారం మండలం కేంద్రంలో తుఫాన్ కారణంగా కురిసిన అకాల వర్షాలకు నేలకొరిగిన వరి పంటలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. అనంతరం మండలంలోని దేశాయిపేటలో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. మొలకలు వచ్చిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు.

Similar News

News November 1, 2025

KNR: అధ్యయనం చేస్తూ.. మెలుకువలు నేర్చుకుంటున్న విద్యార్థులు

image

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బాబు జగ్జీవన్‌ రావు వ్యవసాయ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులు శంకరపట్నం మొలంగూర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని కావేరి సీడ్ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్శనలో విత్తన ఉత్పత్తి, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నాణ్యత, నిల్వ వంటి అంశాలపై విద్యార్థులు నేరుగా పరిశీలించి, మెలుకువలు నేర్చుకున్నారు. క్షేత్రస్థాయి పరిశోధనలు, శిక్షణలో భాగంగా ఈ సందర్శన జరిగిందని వారు తెలిపారు.

News November 1, 2025

HZB: ‘ఆడపిల్ల పుడితే ఆనందంగా స్వాగతించాలి’

image

‘బేటీ బచావో – బేటీ పడావో’, లింగ నిర్ధారణ చట్టంపై శనివారం హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అధ్యక్షత వహించారు. పురుషులతో పోలిస్తే మహిళల శాతం తగ్గడం ఆందోళనకరమన్నారు. లింగభేదం లేకుండా సమానత్వం పాటిస్తే సమాజానికి మంచిదని, ఆడపిల్ల పుట్టినప్పుడు ఆనందంగా స్వాగతించే భావన పెరగాలని ఆమె పిలుపునిచ్చారు.

News November 1, 2025

రేపటిలోగా నిర్ణయం తీసుకోవాలి: ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై రేపటిలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల ఛైర్మన్‌ రమేశ్ బాబు డిమాండ్ చేశారు. లేకపోతే ఎల్లుండి నుంచి ‎రాష్ట్రంలోని అన్ని కాలేజీలు నిరవధిక బంద్‌ చేస్తాయని హెచ్చరించారు. ‎బంద్‌ సమయంలో జరిగే ఎగ్జామ్స్‌ వాయిదా వేయాలని యాజమాన్యాలను కోరుతున్నామన్నారు. ‎కాలేజీలకు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వానికి ఉందా? లేదా? అని ఆయన ప్రశ్నించారు.