News November 1, 2025
నేడు వైవీయూను సందర్శిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి

దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నవంబరు 1న మధ్యాహ్నం 3:30 గంటలకు యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. వైవీయూలో నూతన పరిపాలన భవనంలో ఉన్న తాళ్లపాక అన్నమాచార్య సేనెట్ హాల్లో విద్యార్థులతో ప్రత్యేకంగా సంభాషిస్తారన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులకు ఇదొక అద్భుతమైన అవకాశమన్నారు.
Similar News
News November 1, 2025
కడప: హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపను ఎస్పీ నచికేత్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కడపలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో వారు కలుసుకున్నారు. జిల్లాలో శాంతిభద్రతల విషయం గురించి ఎస్పీ వివరించారు. జిల్లాలో శాంతిభద్రతల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ తెలిపారు.
News November 1, 2025
హౌసింగ్ ఉద్యోగులపై క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశాలు..!

ప్రొద్దుటూరు హౌసింగ్ ఉద్యోగులపై క్రిమినల్ కేసుల నమోదుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రొద్దుటూరు హౌసింగ్ కాలనీల్లో రూ.1,25,16,285ల విలువైన 13678.92MTల బల్క్ శాండ్ దుర్వినియోగమైనట్లు పలువురు ఆరోపించారు. AE వెంకటేశ్వర్లు, WI గుర్రప్ప, ఇందిర, కుమారిని బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేశారు. వీరిపై క్రిమినల్ కేసుల నమోదుకు వివరాలు కోరుతూ.. DEE నుంచి ప్రొద్దుటూరు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News November 1, 2025
ప్రొద్దుటూరు హౌస్ బిల్డింగ్ సొసైటీపై DLCO విచారణ..!

ప్రొద్దుటూరు హౌస్ బిల్డింగ్ సొసైటీ పాలకవర్గం చర్యలపై DLCO సత్యానంద్ శనివారం విచారణ చేపట్టారు. సొసైటీ పాలకవర్గం, సబ్ రిజిస్ట్రార్ కలిసి NOC లెటర్ పేరుతో సాగించిన అన్యాయాలపై దుమారం చెలరేగడంతో DLCO విచారణ చేపట్టారు. సొసైటీ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, కార్యదర్శి విష్ణులను DLCO తన కార్యాలయానికి పిలిపించి NOCలపై విచారించారు. సంబంధిత రికార్డులను తెప్పించుకొని, NOC లెటర్ల చట్టబద్ధతపై విచారిస్తున్నారు.


